మెగా హీరో వరుణ్ తేజ్ ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తాజాగా మట్కా సినిమాతో వస్తున్నాడు. ఇందులో ఆయన గెటప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పైగా ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ క్రమంలోనే ఆయన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మాకు చిరంజీవి గారి నుంచే నటనపై ఆసక్తి పెరిగింది. ఆయన మాకు ఎప్పుడూ ఓ గుడ్ టీచర్ గా ఉండేవారు.
మాకు ఎప్పటికీ గర్వం ఉండకుండా పెంచారు. ఆయన ప్రభావం మా మీద బలంగా ఉంది. ఆయన బడితె పట్టుకుని మమ్మల్ని కరెక్ట్ చేస్తూ ఉండేవారు. నేను చిన్న వాడిని కాబట్టి నాకు ఎక్కువగా దెబ్బలు అంటేవి కాదు. కానీ చరణ్, బన్నీలకు మాత్రం గట్టిగానే బడితె పూజ జరిగేది. వాళ్లిద్దరూ చాలా సార్లు చిరంజీవి చేతుల్లో దెబ్బలు తిన్నారు అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు వరుణ్. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన అలా పెంచాడు కాబట్టే ఇప్పుడు ఇంత ఎదిగినా ఒదిగి ఉంటున్నారంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
చిరంజీవి పెంపకం అంటేనే క్రమశిక్షణ అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇక మట్కా సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నాడు వరుణ్ తేజ్.