యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటోన్న విషయం తెల్సిందే. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మెగా బ్రదర్ నాగబాబు విచ్చేసారు. బేగంపెట్ దేవనార్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులకు నాగబాబు చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కుని అందజేశారు. ఇంకా టీమ్ వరుణ్ తేజ్ ఆధ్వర్యంలో బేగంపెట్ దేవనార్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ వరుణ్ తేజ్ ను ఇంతలా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. దేవనార్ బ్లైండ్ స్కూల్ విద్యార్థుల మధ్య వరుణ్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు .
ఇక వరుణ్ పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తోన్న చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. వరుణ్ నెక్స్ట్ సినిమా షూటింగ్ టైటిల్ గాండీవధారి అర్జున గా ఫిక్స్ చేసారు.