Switch to English

వరుణ్ తేజ్ ని బాగా ఇబ్బంది పెడుతున్న కరోనా.!

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై కమర్షియల్ హీరో అనే యాంగిల్ లో కాకుండా డిఫరెంట్ స్క్రిప్ట్స్ తో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ ని కెరియేట్ చేసుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ‘గద్దలకొండ గణేష్’తో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాని బాక్సింగ్ నేపథ్యంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక మేజర్ షెడ్యూల్ ని కూడా ఫినిష్ చేశారు. కానీ కరోనా వచ్చి సినిమా షూటింగ్స్ ఆపేయడం సంగతి అటు ఉన్నా వరుణ్ తేజ్ ని మాత్రం బాగా ఇబ్బందుల్లో పెట్టేసింది.

ఈ క్వారంటైన్ టైంలో అందరూ ఇంట్లో ఉండి రిలాక్స్ అవుతుంటే వరుణ్ తేజ్ కి మాత్రం రిలాక్సింగ్ కి ఛాన్స్ లేకుండా పోయింది. అలాగే హోమ్ ఫుడ్ ఫుల్ గా ఎంజాయ్ చేసే అవకాశం కూడా మిస్ అయ్యింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ సినిమా కోసం వరుణ్ తేజ్ ఫుల్ డైట్ లో ఉంటూ, రోజుకి 5 గంటలు జిమ్ అండ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ కల్లా సినిమా పూర్తయ్యేది కాబట్టి అప్పటికల్లా తన డైట్ మరియు బాక్సింగ్ ట్రైనింగ్ ముగిసేది. కానీ ఈ లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియకపోవడం వల్ల ఈ క్వారంటైన్ టైం లో కూడా రోజూ 5 గంటల ట్రైనింగ్, ఓన్లీ డైట్ ఫుడ్ మాత్రమే తీసుకుంటూ గడపాల్సి వస్తోంది.

అనుకున్న టైం కంటే ఎక్కువ రోజులు ట్రైనింగ్ అంటేనే కష్టంగా ఉంటుంది కానీ ఈ టైంలో ఇంకా ఎన్ని రోజులు ఇలా లాక్ డౌన్ ఉండాలో తెలియక, ఎప్పటికి షూటింగ్ పూర్తవుతుందో కూడా క్లారిటీ లేకుండా రోజూ కంప్లీట్ ట్రైనింగ్ మోడ్ లో ఉంటూ, డైట్ ఫాలో అవుతూ ఉండడం వరుణ్ కి చాల కష్టమవుతోందని తన సిస్టర్ నిహారిక తెలిపింది. మరి షూటింగ్ లేని టైం లో కూడా రిలాక్సింగ్ లేకుండా ఇలా లాక్ అవ్వడం అంటే కష్టమేమరి.. మరి ఈ కరోనా ఎప్పటికి కనికరించేనో? వరుణ్ తేజ్ ఎప్పటికీ ఫ్రీ అయ్యేనా??

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

కుల వివక్షలో వ్యక్తి హత్య.. తల మొండం వేరు చేసి ఆపై..

కుల వివక్షలో ఏకంగా ఓ వ్యక్తి తలను.. మొండాన్ని వేరు చేసి 35 కత్తిపోట్లు పొడిచిన దారుణ ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో జరిగిన ఈ దారుణ సంఘటనపై పోలీసులు...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

బిగ్ వార్: బాలయ్య వ్యాఖ్యలపై సి.కళ్యాణ్ పేస్ వేల్యూ లేదంటూ కౌంటర్ అటాక్.!

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సినీ ప్రభుఖులంతా కలిసి మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్ విషయంలో చర్చలు జరిపారు....

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

మహేష్, పూరి మధ్య అంతా సమసిపోయిందా?

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఎవరైనా హిట్ అందిస్తే మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా రెండో సారి దర్శకులతో జతకట్టిన సినిమాలు...