మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “మట్కా”. గ్యాంగ్ స్టర్ కమ్ పిరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. “పలాస” మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకుడు. మీనాక్షి చౌదరి, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ హీరోయిన్లు.” హాయ్ నాన్న” వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని రూపొందించిన వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ గా ఈ సినిమా రూపొందుతోంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.
లేటెస్ట్ గా హీరో పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించారు. ఇందులో ఒకటి రెట్రో లుక్ కాగా మరొకటి తనకన్నా ఎక్కువ వయసు ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుండే వరుణ్ చివరిగా “ఆపరేషన్ వాలంటైన్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇప్పుడు వరుణ్ తన ఆశలన్నీ “మట్కా” పైనే పెట్టుకున్నారు. ఫస్ట్ లుక్ లో వరుణ్ ముందు తుపాకీ, డబ్బులు ఉండటాన్ని బట్టి ఇందులో ఆయన మాఫియా డాన్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.