Varun Tej: ‘ఆపరేషన్ వాలంటైన్’ (Operation Valentine) యువతకు స్ఫూర్తినిచ్చే సినిమా అవుతుందని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) అన్నారు. ఆపరేషన్ వాలంటైన్ సినిమా ప్రమోషన్లో భాగంగా విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కంచె తరహాలో ఇటువంటి సినిమా చేయడం నా అదృష్టం. దేశభక్తి ప్రధానంగా సాగే కథ. యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. తెలుగులో ఎయిర్ ఫోర్స్ ఆధారంగా సినిమా రాలేదు. ఆపరేషన్ వాలంటైన్ అలాంటిదే. పుల్వామా ఘటన ఫిబ్రవరి 14న జరిగింది కాబట్టే టైటిల్ ఇలా పెట్టా’మని అన్నారు.
రాజకీయాలపై మాట్లాడుతూ.. ‘బాబాయ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సిద్ధాంతాలు.. నడిచే దారి స్ఫూర్తినిస్తాయి. ఆయనపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మా కుటుంబం ఆదేశిస్తే ఎన్నికల్లో ఆయన తరపున ప్రచారం చేస్తా. గతంలో మా నాన్న ప్రచారం సమయంలో కూడా వెళ్లా’నని అన్నారు.
థ్రిల్లర్, యాక్షన్ నేపథ్యంలో దర్శకుడు ప్రతాప్ సింగ్ హుడా ఆపరేషన్ వాలంటైన్ తెరకెక్కించారు. తెలుగు హిందీ భాషల్లో సినిమా నిర్మాణం జరుపుకుంది. మార్చి 1న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.