నార్నె నితిన్ ఇప్పుడు సరికొత్త పంథాలో సాగుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్టులో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. రొటీన్ కథలకు భిన్నంగా ఆయన సినిమాలు ఉంటున్నాయి. స్టార్ హీరో ఎన్టీఆర్ బావమరిదిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నితిన్. రీసెంట్ గానే ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఇక తాజాగా ఆయన నటించిన శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. శతమానం భవతి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.
సంపద ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 28న రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రొడ్యూసర్ చింతపల్లి రామారావు మాట్లాడుతూ నార్నె నితిన్ చాలా డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తున్నాడు. వరుసగా విజయాలు అందుకుంటున్నాడు. ఇక రాజావారు సినిమాలో కొత్త రకమైన కాన్సెప్టుతో చేస్తున్నాం. ఇది పక్కా పల్లెటూరి వెరైటీ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్. ఇందులో కమర్షియల్ యాంగిల్ కు ఎక్కడా కొదువ ఉండకుండా చూస్తున్నారు దర్శకుడు సతీష్.
యూత్ ను ఆకట్టుకునేలా డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ కథను విని ఎన్టీఆర్ కూడా ఒప్పుకున్నాకే మొదలు పెట్టాం. ఆయ్, మ్యాడ్ లాంటి హిట్లు అందుకున్న నార్నె నితిన్.. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను అందుకుంటాడని నమ్మకం మాకు ఉందంటూ తెలిపాడు. మూవీకి కైలాష్ మీనన్ సంగీతం అందిస్తున్నారు. రావు రమేశ్, రమేశ్ లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.