తమిళ హీరో విజయ్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా వారసుడు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమా తెలుగులోనూ మంచి టాక్ తో రన్ అవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200కోట్లు వసూలు చేసిన ఈ సినిమా విజయాన్ని టీమ్ సెలబ్రేట్ చేసుకుంది.
నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ లోని తన ఇంట్లోనే సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి విజయ్ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాడు. శనివారం రాత్రి ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీలో రష్మిక మినహా చిత్ర బృందం అంతా పాల్గొంది. ఇక ఈ పార్టీ ఎంతో సందడిగా జరిగింది. పార్టీలో దిల్ రాజు మనవరాలు ఇషిత సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సినిమాలోని రంజితమే పాటకు ఇషిత డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇషిత డ్యాన్సులకు విజయ్ ముచ్చటపడిపోయారు. దీంతో ఆమెను ఎత్తుకుని ముద్దాడారు.
Celebrations everywhere #Varisu 🤩#MegaBlockbusterVarisu pic.twitter.com/1ILDidzH75
— Vijay Fans Trends (@VijayFansTrends) January 21, 2023