సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ పాటను కాపీ చేశారంటూ కేరళకు చెందిన తెయ్యుకుడుం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ కోయ్ కోడ్ జిల్లాలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఓటీటీలో ఒరిజినల్ ట్యూన్ మార్చి రిలీజ్ చేశారు. పాట కాపీరైట్ వివాదంలో చిక్కుకోవడంతో వేరే ట్యూన్ యాడ్ చేశారు. దీంతో ఆడియన్స్ నిరుత్సాహానికి లోనయ్యారు.
ఇప్పుడు మ్యూజిక్ బ్యాండ్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. దీంతో అమెజాన్ ప్రైమ్ లో తమిళ, మలయాళ వెర్షన్లో ఒరిజినల్ ట్రాక్ యాడ్ చేశారు. త్వరలోనే తెలుగు, కన్నడ వెర్షన్లో కూడా యాడ్ చేయనున్నారు. ప్రస్తుతం తమిళ, మళయాల ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు.. కేరళ పాలక్కడ్ జిల్లా కోర్టులో కూడా మరో కేసు నమోదై ఉంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా 400కోట్లు వసూలు చేసింది.