Switch to English

వారసుడు కాదు, కాలకేయుడు.! దొరకని దుర్మార్గుల మాటేమిటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,477FansLike
57,764FollowersFollow

ఈ అరాచకం ఇప్పుడు మొదలైంది కాదు.. ఏళ్ళు గడిచిపోయాయ్.. బాధితులు పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో వున్నారు.! తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ గురించి ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ వినిపిస్తోన్న, కనిపిస్తోన్న విశ్లేషణలివి.

మనం మనుషుల మధ్య వున్నామా.? భయంకరమైన క్రూర మృగాల నడుమ వున్నామా.? అంటే, కాస్తో కూస్తో మనుషుల కంటే క్రూరమృగాలే నయమేమో అనిపించకమానదు. ఓ కుటుంబం సామూహికంగా బలవన్మరణానికి పాల్పడటానికి ఎమ్మెల్యే తనయుడు కారణమని తెలిశాక, వ్యవస్థ ఏం చేసింది.?

ఎమ్మెల్యే కొడుకు కాబట్టి, అతన్ని పట్టుకోవడంలో పోలీసులు అసత్వం ప్రదర్శిస్తున్నట్లే కనిపిస్తోంది. పోలీసులకు ఎమ్మెల్యే తన కొడుకుని అప్పగించినట్లుగా వార్తలొచ్చాయి. కానీ, పోలీసులేమో అరెస్టు చేయలేదంటున్నారు. ఇంతకీ, వనమా రాఘవ ఎక్కడ.?

ఇది ఒక్క వనమా రాఘవ గురించి మాత్రమే చర్చించుకోవాల్సిన సందర్భం కాదు. ‘అరగంట చాలు’, ‘ఐదు నిమిషాల్లో పని కానిచ్చేస్తాను..’ అంటున్న ప్రజా ప్రతినిథుల గురించి కూడా జనబాహుళ్యంలో చర్చ జరగాలి. తెలంగాణలో ఓ ప్రజా ప్రతినిథి కొడుకు ఇంతటి హేయమైన పనికి ఒడిగట్టాడని మాట్లాడుకోవడం కాదు. వ్యవస్థలో పైకి పెద్ద మనుషుల్లా చెలామణీ అవుతున్న నరరూప రాక్షసుల గురించి చర్చ జరగాలి.

వందలాది, వేలాది దుర్మార్గాలు అధికార పార్టీ నేతల నుంచి జరిగితే, పదుల సంఖ్యలో కూడా కేసులు నమోదవవు. సోషల్ మీడియాలో ఎవడన్నా అధికార పార్టీ నేతల మీద కామెంట్లు పెడితే అరెస్టులు జరుగుతాయ్. కానీ, అధికార పార్టీ నేతలు హత్యలు, హత్యాయత్నాలు చేసినా సీరియస్ చర్యలుండవ్. ఇదే రాజకీయం.

మన బాసునే విమర్శిస్తావా.? అంటూ, సొంత పార్టీకి చెందిన కింది స్థాయి నేతని అతి కిరాతకంగా చావబాదిన ఓ వైసీపీ మద్దతుదారుడి వ్యవహారం ఆ మధ్య తెరపైకొస్తే, ఆ ఘటనపై సదరు మంత్రిగారు చేసిన తేలికపాటి వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే వుంటాయి. ఇలా తగలడింది సమాజం.

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మీద అనుమానం రాగానే కేసులు నమోదయ్యాయి తెలంగాణలో. మరి, వనమా వెంకటేశ్వరరావు తనయుడిపై చర్యలకు ఇంత ఆలస్యమెందుకయ్యింది.? చెప్పుకుంటూ పోతే రాజకీయ వ్యవస్థలో అడుగడుగుకీ ఓ నరరూపరాక్షసుడు కనిపిస్తాడు. కానీ, పోలీసు వ్యవస్థకే అధికార పార్టీలు ‘కళ్ళగంతలు’ కట్టేస్తాయ్ గనుక, వాళ్ళకి మాత్రం ఈ దుర్మార్గాలు కనిపించవ్.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

ఎక్కువ చదివినవి

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

రామ్ చరణ్ కి డాక్టరేట్.. పవన్ కళ్యాణ్ అభినందనలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) మరో అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ చరణ్ కి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది....

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...