వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు విజయ సాయి రెడ్డి.. అనాలేమో.! లేకపోతే, విజయ సాయి రెడ్డి ‘విలువలు, విశ్వసనీయత’ గురించి మాట్లాడటమేంటి.? వినడానికే అసహ్యంగా వుంటుంది కదా.! అయినా, ఇది కలికాలం.!
అసలు విషయానికొస్తే, ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు విజయ సాయి రెడ్డి. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారాయన. రాజకీయాలు వదిలేసి, వ్యవసాయం చేసుకోవాలనే బుద్ధి పుట్టిందాయనకి. నమ్మితే నమ్మండి, లేకపోతే మీ ఖర్మ. ఆయన అలానే చెబుతున్నాడు మరి.!
ఏమయ్యిందోగానీ, విలువలు.. విశ్వసనీయత.. అంటూ ఏవేవే మాటలు చెబుతూ విజయ సాయి రెడ్డి ట్వీటేశారు. అది కూడా, ‘విలువలు – విశ్వసనీయత’ గురించి నిన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్‌లో సెటైరేశాక, విజయ సాయి రెడ్డి నుంచి ీ ట్వీటు వచ్చిందాయె.
ఇదీ ట్వీటు సారాంశం..
‘‘వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా.’’
విశాఖలో భూముల కబ్జా, ఇతరత్రా దోపిడీ వ్యవహారాలకు సంబంధించి విజయ సాయి రెడ్డిదే కీలక పాత్ర.. అని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయ్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విజయ సాయి రెడ్డిని కడిగి పారేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా కూలీలు.
ఇన్నాళ్ళూ ఆ నీలి కూలీల్ని పెంచి పోషించిన వైసీపీలో కీలక పాత్ర పోషించింది స్వయానా విజయ సాయి రెడ్డే. ఆ మాటకొస్తే, పేటీఎం కూలీల్ని మేనేజ్ చేయడంలో విజయ సాయి రెడ్డి సిద్ధహస్తుడు.
ఈ ట్వీటుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయ సాయి రెడ్డి కౌంటర్ ఎటాక్ ఇచ్చారని అనుకోవాలా.? లేదంటే, ఇందో కొత్త డ్రామా అనుకోవాలా.? విజయ సాయి రెడ్డి అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. పైగా, జగన్ అక్రమాస్తుల కేసులో ఎ2 నిందితుడు కూడా.!
అక్రమాస్తుల కేసులో పదహారు నెలలు జైల్లో వున్న విజయ సాయి రెడ్డి, విలువలు – విశ్వసనీయత గురించి మాట్లాడినా, ట్వీట్లేసినా అసహ్యంగా వుంటుంది కదా.!