బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమాతో రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న జాక్ సినిమాపై వైష్ణవి చైతన్య చాలా హోప్స్ పెట్టుకుంది. బేబీ తర్వాత ఒకటి రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు వైష్ణవి.
కేవలం సినిమాలే కాదు సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో కూడా అదరగొట్టేస్తుంది అమ్మడు. ఈమధ్య సినిమాల కన్నా ఫోటో షూట్స్ ద్వారా ఆడియన్స్ లో ఫాలోయింగ్ తెచ్చుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. వారి బాటలోనే అటు సినిమాలు ఇటు ఫోటో షూట్స్ ఎందులోనూ తగ్గేదేలేదు అనేలా ఉంది అమ్మడు.
ముఖ్యంగా బేబీలో తన పాత్రతో యూత్ ఆడియన్స్ కి దగ్గరైన వైష్ణవి యువతలో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ ఇమేజ్ ని కొనసాగించాలంటే రకరకాల ఫోటో షూట్స్ చేయాల్సిందే. రీసెంట్ గానే శారీలో ఫాలోవర్స్ హార్ట్ బ్రేక్ అయ్యేలా చేసిన వైష్ణవి లేటెస్ట్ గా బ్లాక్ డ్రెస్ లో చితక్కొట్టేసింది. ఈ ఫోటో షూట్ లో వైష్ణవి షైనింగ్ బ్యూటీగా అదిరిపోయింది. జస్ట్ ఆమె లుక్స్ కే ఫాలోవర్స్ అంతా అలా పడిపోవాల్సిందే అనేలా ఉంది. తప్పకుండా ఈ ప్రయత్నాలు వైష్ణవికి మంచి పాపులారిటీ తెచ్చిపెడుతున్నాయని చెప్పొచ్చు.