Switch to English

మోడీసారూ.. వ్యాక్సిన్లు లేకుండా.. వ్యాక్సినేషన్ వేగవంతమెలా.?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏం చెబితే అదే కరెక్టు. కాదని ఎవరన్నా అన్నారో, వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నించారో.. వాళ్ళంతా దేశద్రోహుల కిందే లెక్క. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మహబాగా జరిగిపోతోందని కేంద్రం చెబుతోంది. అంతే కాదు, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలంటూ రాష్ట్రాలకు సూచిస్తోంది. ఇదెక్కడి వింత పోకడ.? దేశంలో సరిపడా వ్యాక్సిన్లు వున్నాయా.? ప్చ్.. లేదాయె.! మరెలా వ్యాక్సిన్లు దేశవ్యాప్తంగా, అత్యంత వేగవంతంగా జనాలకు వేసేది.? అదంతే, నరేంద్ర మోడీ చెప్పారు గనుక.. అక్కడేదో మంత్ర దండం వుందనుకుని ఏర్పాట్లు చేసేసుకోవాలి రాష్ట్రాలన్నీ.

 

నిజానికి, మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 18 నుంచి 45 ఏళ్ళ పైబడిన వయసువారికి టీకాలు వేయాల్సి వుంది.. ఇది అప్పటికే వ్యాక్సినేషన్ చేస్తోన్న 45 ఆ పైబడిన వయసువారికి అదనం. కానీ, చాలా రాష్ట్రాల్లో 18 నుంచి 45 ఏళ్ళ మధ్య వయసున్నవారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అందుక్కారణం, వ్యాక్సిన్ల కొరత. వ్యాక్సిన్లను తయారు చేసే సంస్థలు, అవసరమైన మేర ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవాలంటే, ఆ పని చేయాల్సింది కేంద్రం. వ్యాక్సినేషన్ ప్రక్రియా అంతా కేంద్రం కనుసన్నల్లోనే జరుగుతున్న దరిమిలా, రాష్ట్రాలకు పరిమిత బాధ్యతలు మాత్రమే వున్నాయిక్కడ. అదే అసలు సమస్య. ఇబ్బడిముబ్బడిగా వివిధ సంస్థల తాలూకు వ్యాక్సిన్లు వచ్చే పరిస్థితి వుంటే, రాష్ట్రాలు రికార్డు సమయంలో తమ ప్రజలకు వ్యాక్సిన్లను అందించి తీరతాయి.

 

ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మొత్తమ్మీద, మోడీ ప్రభుత్వం చెప్పేదానికీ.. చేసేదానికీ అస్సలు పొంతన లేకుండా వ్యవహారాల్ని నడిపించేస్తోందన్నమాట. వ్యాక్సిన్ విషయంలోనూ, కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలోనూ, కోవిడ్ విషయమై రాష్ట్రాలను అప్రమత్తం చేయడంలోనూ.. ఇలా అన్ని విషయాల్లోనూ నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమయ్యిందన్నది నిర్వివాదాంశం. సెకెండ్ వేవ్ దెబ్బకి దేశం విలవిల్లాడుతోంది.. వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి రాకపోతే, మూడో వేవ్ ని భరించే శక్తి దేశానికి లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

మునుగోడు తీర్పుతో సీఎం కేసీర్ పతనం ప్రారంభమవుతుంది: కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి

తన త్యాగం వల్లే మునుగోడు అభివృద్ధి చెందబోతోందని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. మునుగోడులో మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టణాభివృద్ధి నా రాజీనామాతోనే జరుగుతుందని ప్రజల్లో చర్చ మొదలైంది. అందరి అభిప్రాయం...

‘నా చేతిపై ఉన్న టాటూను ఫ్యాన్స్ వేయించుకోవద్దు..’ కారణం చెప్పిన నాగచైతన్య

తన చేతిపై ఉన్న టాటూను అభిమానులు ఎవరూ వేయించుకోవద్దని టాలీవుడ్ హీరో నాగ చైతన్య కోరారు. లాల్ సింగ్ చద్దా ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు....

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. మరి ఈరోజే విడుదలైన ఈ...

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా, విరాజ్ అశ్విన్ మరో ప్రధాన పాత్రను...

రాశి ఫలాలు: ఆదివారం 14 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ బహుళ తదియ రా.2:00 వరకు తదుపరి చవితి సంస్కృతవారం: భాను వాసరః (ఆదివారం) నక్షత్రము: పూర్వాభాద్ర రా.2:05 వరకు తదుపరి...