Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల కానుంది. అయితే.. సినిమాకు మరో సంగీత దర్శకుడు తమన్ పని చేస్తున్నాడని మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ ఇచ్చిన ఓ అప్డేట్ పవన్ అభిమానుల్లో జోష్ నింపుతోంది.
వివరాల్లోకి వెళ్తే సినిమాకు సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ డ్యాన్సులు మంచి ఉత్సాహాన్ని అందించాయి. అయితే.. బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ మాత్రం తమన్ అందిస్తారని తెలిపింది. కారణం.. దేవిశ్రీ కమిట్ మెంట్స్ కి మూవీ రీల్స్ పంపడం లేట్ కారణంగా దేవి టైమ్ కేటాయించలేకపోతున్నారు.
ఇద్దరు సంగీత దర్శకుల అంగీకారంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది. పవన్ సినిమాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్, ఓజీ సినిమాలకు తమన్ వర్క్ చేశారు. ఇందులో ‘ఓజీ’కి తమన్ వర్క్ పవన్ అభిమానులకు హై ఎండ్ కిక్ ఇచ్చింది. ఇప్పుడు ఉస్తాద్.. కి కూడా తమన్ కావడంతో వారి అంచనాలు రెట్టింపయ్యాయి.
