Switch to English

చైనాతో అమీతుమీకి అమెరికా రెడీ

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రబలడానికి ముమ్మాటికీ చైనాయే కారణమని బలంగా నమ్ముతున్న అగ్రరాజ్యం అమెరికా.. డ్రాగన్ కంట్రీపై ముప్పేట దాడికి సమాయత్తమవుతోంది. ఆ వైరస్ ను కోవిడ్ లేదా కరోనా అని కాకుండా చైనా వైరస్ గా పిలిచే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇప్పటికే చైనాపై పలుమార్లు తన అక్కసు ప్రదర్శించారు. అవకాశం దొరికితే ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇటీవల పలుదఫాలుగా ఈ విషయంలో ట్రంప్ తన వైఖరిని స్పష్టంగానే బయటపెట్టారు. కరోనా వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే పుట్టిందనడానికి ఆధారాలున్నాయని పేర్కొంటున్న అమెరికా.. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థపైనా విరుచుకుపడుతోంది. అవసరమైతే చైనాతో సంబంధాలు పూర్తిగా తెగదెంపులు చేసుకునేందుకు కూడా వెనకాడబోమని ట్రంప్ హెచ్చరించారు.

రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోతే తమకు 500 బిలియన్ డాలర్ల ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అటు చైనాను, ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థను ఇరుకున పెట్టే కార్యాచరణకు అగ్రరాజ్యం సర్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా భారత్ కు సైనికపరమైన సాయం అందించడం ద్వారా చైనాపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది.

అలాగే తైవాన్, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఆయుధాలు విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. చైనాలో ఉన్న అమెరికా సంస్థల్ని వెనక్కి రప్పించడంతోపాటు అమెరికాలో చైనా ప్రభుత్వం నడుపుతున్న మీడియా సంస్థల్ని నిషేధించాలని తీర్మానించింది. అలాగే డబ్ల్యూహెచ్ఓ స్వతంత్రత మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

వైరస్ విషయంలో అబద్దాలు చెప్పిన చైనాపై ఆంక్షలు విధించాలని భావిస్తోంది. మొత్తానికి చైనాపై ముప్పేట దాడి చేయడం ద్వారా ఆ దేశాన్ని అష్టదిగ్బంధనం చేయాలని అగ్రరాజ్యం గట్టి పట్టుదలతో ఉంది. ఇది కొంతవరకు భారత్ కు మేలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు చైనా వైపు చూసిన పలు విదేశీ కంపెనీలు.. ఇకపై భారత్ వైపు మళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. చైనా తర్వాత ఆ స్థాయిలో మానవ వనరులు, మార్కెట్, ఇతరత్రా సౌకర్యాలు అందుబాటులో ఉన్న భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు క్యూ కట్టడం ఖాయమని పేర్కొంటున్నారు. దీనిని భారత్ అవకాశంగా మలుచుకుంటే ఆర్థికంగా వృద్ధి సాధించే అవకాశాలున్నాయి.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

విశాఖ గ్యాస్‌ లీక్‌: ఎల్జీ పాలిమర్స్‌కి బిగ్‌ షాక్‌.?

యావత్‌ భారతదేశాన్ని కుదిపేసింది విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన. ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన విష వాయువు లీక్‌ కావడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన ‘స్టైరీన్‌’...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌ ప్రస్తుతం హీరోయిన్‌ పూజా కుమార్‌ తో...

క్రైమ్ న్యూస్: కలకలం రేపుతున్న బావిలో మృతదేహాలు

వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ వరుసగా మృతదేహాలు బయటపడడం ఆ ప్రాంతంతో తీవ్ర కలకలం రేపుతోంది. ముందురోజు నాలుగు మృతదేహాలు లభ్యమవగా.. ఈ రోజు ఉదయం మరో మూడు మృతదేహాలు...

క్రైమ్ న్యూస్: కాటికెళ్లే వయసులో బాలికపై అత్యాచారం.!

బాలికలపై అత్యాచారాలను అరికట్టాలని ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఇంకా వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటువంటి ఓ దురాగతం సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం పంచాయితీలోని కిష్టయ్యపల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలో కుటుంబంతో కలిసి...

బన్నీ కోసం మారుతి కథ రెడీ అయిపోయిందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు, సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతికి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరూ చాలా క్లోజ్. ఇటీవలే మారుతి మాట్లాడుతూ తామిద్దరం వాట్సాప్ లో తరచూ టచ్...