Urvashi Rautela: బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోంది. అయితే.. సినిమాలోని దబిడి, దబిడి పాటలో ఊర్వశి రౌతేలాతో వేసిన స్టెప్స్ పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై నటి ఊర్వశి రౌతేలా బాలీవుడ్ మీడియాలో స్పందించారు.
‘బాలకృష్ణగారితో చేసిన డ్యాన్స్ ను కళగానే చూడాలి. సినిమా సక్సెస్ అయితే ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతాయి. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బాలకృష్ణగారు లెజెండ్. ఆయనతో నటించాలనే కోరిక తీరింది. ఆయనతో డ్యాన్స్ చేయడం అంటే కళకు నేను ఇచ్చుకున్న గౌరవంగా భావిస్తా’.
‘పాటపై వచ్చిన ట్రోలింగ్స్ చూశాను. ట్రోలింగ్స్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జీవితంలో ఏమీ సాధించలేని వాళ్లే ఇలాంటి విమర్శలు చేస్తూ తామేదో సాధించామనుకుంటారు. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. ఎదుటి వారిని విమర్శించడం కంటే వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లడం ముఖ్య’మని అన్నారు. ఊర్శశి రౌతేలా చిరంజీవి వాల్తేరు వీరయ్యలో కూడా స్పెషల్ సాంగ్ చేశారు.