అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప-2 ప్రమోషన్స్ అప్పుడే మొదలు పెట్టాడు. ఇందులో భాగంగా ఆయన తాజాగా అన్ స్టాపబుల్ షోకు వచ్చాడు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నాడు. ముందుగా పుష్ప-2 మేనరిజాన్ని ముందుగా వీరిద్దరూ ట్రై చేశారు. ఆ తర్వాత చాలా విషయాలను మాట్లాడుకున్నారు. మొదటగా నేషనల్ అవార్డు గురించి ప్రశ్నించాడు బాలయ్య. దానిపై అల్లు అర్జున్ మాట్లాడుతూ మన తెలుగు వారికి ఎవరికైనా ఉత్తమ జాతీయ నటుడి అవార్డు ఎవరికైనా వచ్చిందా అని చెక్ చేస్తే.. ఒక్కరి పేరు కూడా లేదు.
అప్పుడే డిసైడ్ అయ్యాను. కచ్చితంగా ఇది కొట్టాలి అనుకున్నాను. ఇన్ని రోజులకు కొట్టాను అంటూ తెలిపాడు బన్నీ. ఇక ఇదే షోకు బన్నీ తల్లి నిర్మల కూడా వచ్చారు. ఆమెతో కూడా బాలయ్య మాట్లాడారు. బన్నీని చిన్నప్పుడు ఎప్పుడైనా కొట్టారా అంటూ ప్రశ్నించారు. వెంటనే బన్నీ కలగజేసుకుని.. దేనితో కొట్టలేదో అడగండి దాదాపు అన్ని వెపన్లు నా మీద వాడేసింది. ఆమె అలా కొట్టింది కాబట్టే ఇప్పుడు ఇలా సినిమాలు చేస్తున్నాం అంటూ తెలిపాడు. ఇక బాలయ్య కలగజేసుకుని ఇంతకీ నువ్వు ఏ వెపన్ తో మారావు అని ప్రశ్నించారు.
స్నేహ అనే వెపన్ తో మారాను అంటూ బన్నీ వివరించారు. దాంతో షోలో నవ్వులు పూశాయి. ఇదే షోలో చిరంజీవి, వెంకటేశ్ గురించి కూడా మాట్లాడుకున్నారు.