Switch to English

బిగ్‌ బాస్ 6 శ్రీ సత్య గురించి ఆసక్తికర విషయాలు

91,315FansLike
57,001FollowersFollow

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో ఆరవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన తెలుగు అమ్మాయి క్యూట్ ముద్దుగుమ్మ శ్రీ సత్య. హౌస్ లో కి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే తనకు తిండి అంటే మహా పిచ్చి అంటూ నిర్మోహమాటంగా చెప్పేసింది. నాగార్జున గారి చేతుల మీదుగా చికెన్ తీసుకొని మరి హౌస్ లో అడుగు పెట్టింది. అప్పటి నుండి తిండి విషయంలో ఆమెను ఎంతో మంది ఎన్నో రకాలుగా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.

మొదటి రెండు వారాల్లో ఆట విషయంలో కాస్త విమర్శలు ఎదుర్కొన్నా తనదైన సమయం వచ్చినప్పుడు ఆడ పులి మాదిరిగా శ్రీ సత్య తన ప్రతిభను కనబరుచుతూనే ఉంది. ఇక శ్రీ సత్య మరియు అర్జున్ ల మధ్య బాండింగ్ చాలా క్యూట్ గా ఉందంటూ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఆసక్తికరంగా ఆటను ముందుకు తీసుకెళుతున్న శ్రీ సత్య గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.

శ్రీ సత్య పూర్తి పేరు మంగళంపల్లి శ్రీ సత్య. 1997 జూన్ 29వ తారీఖున ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ లో జన్మించింది. ఈ అమ్మాయి విద్యాభ్యాసమంతా కూడా విజయవాడలోనే జరిగింది. చిన్నప్పటి నుండి నటన మరియు డాన్స్ పై ఆసక్తి ఉండడంతో స్కూల్ ప్రోగ్రామ్స్ లో యాక్టివ్ గా పాల్గొనేదట. చూడ్డానికి చాలా అందంగా ఉండడంతో స్కూల్ మరియు కాలేజ్ డేస్ లో ఆమె అందరి దృష్టిని ఆకర్షించేది.

అందుకే మోడల్ గా మారి మిస్ విజయవాడ టైటిల్ ని గెలుచుకుంది. ఆ తర్వాత మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ ని కూడా దక్కించుకుంది. మిస్ ఏపీ అయిన తర్వాత ఈమెకి సినిమాలు మరియు సీరియల్స్ లో ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. రామ్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన నేను శైలజ చిత్రంలో శ్రీ సత్య కి చిన్న పాత్ర దక్కింది. ఆ పాత్ర వల్ల పెద్దగా గుర్తింపు దక్కలేదు.

ఆ తర్వాత లవ్ స్కెచ్, గోదావరి నవ్వింది వంటి చిన్నా చితక సినిమాల్లో నటించింది. సినిమాల్లో నటిస్తున్న సమయంలో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సీరియల్స్ వైపు అడుగులు వేసింది. సినిమాల్లో చేసిన అనుభవంతో ముద్దమందారం సీరియల్ ద్వారా బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నిన్నే పెళ్లాడుతా, అత్తారింట్లో అక్క చెల్లెలు, త్రినయని ఇంకా కొన్ని సీరియల్స్ లో నటించి మెప్పించింది.

అంతా బ్రాంతియేనా, తొందర పడకు సుందర వదన సినిమాల్లో మళ్లీ నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఈసారి కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. వెబ్ సిరీస్, సీరియల్స్ ఇలా ఎక్కడ చూసినా కూడా శ్రీ సత్య కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈమెకు ఉన్న పాపులారిటీ అంతా కాదు. అందుకే శ్రీ సత్య కి బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చింది.

ఆమె వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెంటనే ఓకే చెప్పింది. శ్రీ సత్య కి సోదరి ఉంది, ఆమె పేరు సాయి ప్రవల్లిక. ఇక శ్రీ సత్య కి ఎన్టీఆర్ అంటే అమితమైన అభిమానం. ఆయన నటించిన ప్రతి ఒక్క సినిమాని చూసిందట. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌ స్టాలో చాలా యాక్టివ్ గా ఉండే శ్రీ సత్య కి ప్రస్తుతం దాదాపుగా 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

బిగ్ బాస్ నుండి బయటకు వచ్చేప్పటికి ఆమె ఫాలోవర్స్ సంఖ్య మిలియన్ చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి శ్రీ సత్య బిగ్ బాస్ జర్నీ అలా అలా సాగుతుంది. ఇంకాస్త కష్టపడి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తే టాప్ 5 వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ బిగ్ బాస్ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్యూట్నెస్ తో పాటు కాస్త తెలివి కూడా ప్రదర్శించి శ్రీ సత్య ఆటలో మరింత విజయాన్ని సక్సెస్ ని సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పిక్ టాక్: చీర కట్టు ఊర్వశి… మతిపోగొడుతున్న రాక్షసి

రీసెంట్ గా ఊర్వశివో రాక్షసివో చిత్రంలో కనిపించింది అను ఇమ్మానుయేల్. చాలా కాలం తర్వాత ఆమెకు మంచి రోల్ పడింది. అల్లు శిరీష్ సరసన నటించి...

దిల్ రాజు రెండో పెళ్లి వెనుక ఏం జరిగిందో తెలుసా?

ఇటీవలే అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రముఖ టాక్ షో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకు గెస్ట్ గా వచ్చిన విషయం తెల్సిందే. ఈ ప్రోగ్రాంలో...

కాంట్రావర్సి సమసిపోయింది- ‘యశోద’ నిర్మాత కృష్ణప్రసాద్

సమంత టైటిల్ పాత్రలో హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా 'యశోద'. నవంబర్ 11న...

ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం.. జీవితాంతం సినిమాల్లోనే: చిరంజీవి

‘గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవాల్లో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేదని బాధపడ్డా.. ఇప్పుడు ఇక్కడే అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు...

ఆ స్టార్ హీరో మనసులో కృతి సనన్..! వరుణ్ ధావన్ కామెంట్స్...

హీరోయిన్ కృతి సనన్ ను ఓ స్టార్ హీరో ప్రేమిస్తున్నారనే అర్ధం వచ్చేలా హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీంశమయ్యాయి. తాను హీరోగా...

రాజకీయం

ఉపాధ్యాయులకు బిగ్ రిలీఫ్..! రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉపాధ్యాయుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులను ఇకపై బోధనేతర విధుల నుంచి తప్పిస్తూ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం ఇకపై ఉపాధ్యాయులు విద్యా...

న్యాయస్థానాల్లో తీర్పులు.! తెలుగు మీడియాలో వక్రభాష్యాలు.!

సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై వాదోపవాదాలు జరిగాయి. రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల్ని సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుల్లోని...

అరెస్టు బాధాకరమట.! సజ్జల నోట తియ్యని మాట.! విజయమ్మ బెదిరింపులు.!

తెలంగాణలో అరెస్టు బాధాకరం.! ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు మాత్రం ‘చట్టం తన పని తాను చేసుకుపోవడం’.! రాజకీయ నాయకులు రెండు నాల్కల ధోరణితో వుంటారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు...

జస్ట్ ఆస్కింగ్: ఎవరి తల ఎక్కడ పెట్టుకోవాలి.?

2019 ఎన్నికల సమయంలో జరిగిన వైఎస్ వివకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి దోషులెవరన్నదీ తేలలేదు.! అసలంటూ దేశంలో న్యాయం జరుగుతుందా.? అన్న ప్రశ్న, ఇదిగో ఇలాంటి కేసుల సందర్భంగానే తెరపైకొస్తుంటుంది. వివేకానందరెడ్డి అంటే ఆషామాషీ...

అయిపాయె.! వివేకా హత్యకేసు తెలంగాణకి బదిలీ.!

వైఎస్ వివేకానందరెడ్డి.! మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ.. తెలుగునాట రాజకీయాల్లో వైఎస్ వివేకానందరెడ్డి పేరు తెలియనివారు వుండరు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి స్యానా సోదరుడు వైఎస్ వివేకాందరెడ్డి. అంతేనా,...

ఎక్కువ చదివినవి

నారా లోకేశ్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు..! కార్యకర్తల ఆనందం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర పర్యటన ఖరారైంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఈమేరకు నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 27...

మల్లారెడ్డి సంస్థల్లో ముగిసిన సోదాలు..! కోట్లలో నగదు స్వాధీనం..! ఎంతంటే..

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై 22న మొదలైన ఐటీ సోదాలు నేడు ముగిసాయి. ఈ సోదాల్లో దాదాపు రూ.15కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ వర్గాలు వెల్లడించాయి. మల్లారెడ్డి వ్యాపార లావాదేవీల్లో భారీ అక్రమాలు...

నెల్లూరు కోర్టులో పత్రాల చోరీ కేసు..! రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం

ఈ ఏడాది నెల్లూరు కోర్టులో జరిగిన ఫైల్స్ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు చీఫ్ జస్టిస్ పీ.కే.మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. ఏపీ మంత్రి...

శీతాకాలంలో “గుర్తుందా శీతాకాలం”

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. టాలెంటెడ్ యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కి బ్యూటీ త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు....

ఫైమాని సేవ్ చేసి.. రాజ్‌ని బలిపశువుగా మార్చేసి.!

బిగ్ బాస్ రియాల్టీ షోలో రియాల్టీ గురించి అస్సలు ఆలోచించకూడదు. రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు.! కానీ, వికెట్ పడాల్సింది ఫైమాది. ఫైమా వద్ద ఎవిక్షన్ ఫ్రీ పాస్ వుండటంతో ఆమె గట్టెక్కింది. నిజానికి,...