నందమూరి తారక రత్న అనూహ్యంగా అజాత శతృవు అయిపోయాడు. ఒకప్పుడు నందమూరి కుటుంబంలో యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి బద్ధ శతృవు అనే విమర్శలు ఎదుర్కొన్న తారక రత్న, ఆ నందమూరి కుటుంబం నుంచే సహాయ నిరాకరణను ఎదుర్కొన్నాడని ఎంతమందికి తెలుసు.?
ఒకేసారి ఏకంగా తొమ్మిది సినిమాల ప్రారంభోత్సవం.! టాలీవుడ్‌లో ఏ హీరోకీ లేని ట్రాక్ రికార్డ్ ఇది. అయితే, అలా ప్రారంభోత్సవం జరుపుకున్న సినిమాల్లో కొన్ని సెట్స్ మీదకీ వెళ్ళలేదనుకోండి.. అది వేరే సంగతి. ‘అసలు సిసలు జూనియర్ ఎన్టీయార్‌ని నేనే.. ఎన్టీయార్ అంటే ఒకరు నందమూరి తారక రామారావు.. ఇంకొకరు నేనే.. అదే నందమూరి తారక రత్న..’ అని చెప్పుకున్నాడు అప్పట్లో తారక రత్న.
ఆకస్మిక గుండెపోటుతో ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్న తారక రత్న జీవితంలోకి తొంగి చూస్తే.. సినిమా స్టోరీల్ని తలపించే ట్విస్టులు కనిపిస్తాయి. పెళ్ళయి, విడాకులు తీసుకున్న ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు తారక రత్న. ఏడాది సహజీవనం, ఆ తర్వాత పెళ్ళి.. ఈ క్రమంలో ఇరు కుటుంబాలూ ఆ జంటని దాదాపుగా వెలివేసినంత పని చేశాయట.
అప్పుడే తారక రత్న తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్ళాడని అంటారు. అలా డిప్రెషన్‌లోకి వెళ్ళడం, ఈ క్రమంలో తలెత్తిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆ తర్వాత ముదిరి పాకాన పడ్డం, అవిప్పుడు ప్రాణాంతకంగా మారాయని అంటున్నారు.
ఇంకోపక్క, మొదటి నుంచీ అల్లరి అబ్బాయ్ అయిన తారక రత్నకి తండ్రి మోహన కృష్ణ నుంచి చిన్నప్పుడే బెల్టు దెబ్బలూ తగిలాయట. సినీ కుటుంబం నుంచి రావడం, స్వతహాగా మంచి డాన్సర్ కావడం.. ఇవన్నీ సినిమాల పట్ల తారక రత్నలో ఆసక్తి పెంచాయి. కానీ, ఇష్టపడి ఎంచుకున్న సినిమా రంగంలో సక్సెస్ రాకపోవడంతో, డీలాపడి.. స్నేహితులతో కలిసి చెడు అలవాట్లకు బానిస అయిపోయాడట తారక రత్న.
అన్నట్టు, 2012లో అలేఖ్యా రెడ్డితో పెళ్ళయి, కూతురు పుట్టాక.. మళ్ళీ అటు వైపు, ఇటు వైపు కుటుంబాలకు తారకరత్న కుటుంబం దగ్గరైంది. ఆ ఆనందం ఓ వైపు, కెరీర్ విషయంలో బెంగ ఇంకో వైపు.. ఈ క్రమంలోనే సినిమాల్ని వదిలేసి, రాజకీయాలపై తారకరత్న ఫోకస్ పెట్టాడు.
పేగు సంబంధిత సమస్య కారణంగానే ఇప్పుడు తారక రత్న ఆరోగ్యం అత్యంత విషమంగా మారినట్లు తెలుస్తోంది. గుండెలోపల ఎడమ కవాటాలు పూర్తిగా మూసుకుపోయాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగా ఆయనకు ప్రస్తుతం ఎక్మో ద్వారా వైద్య చికిత్సను అందిస్తున్నారు బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు.
మొత్తమ్మీద, తారక రత్న జీవితం.. పూల బాటే అయినా, అందులో కనిపించని చాలా చాలా ముళ్ళూ వున్నాయ్. ఏదిఏమైనా, తారక రత్నా.. క్షేమంగా తిరిగొచ్చెయ్.. అంటూ లక్షలాది మంది ఆకాంక్షిస్తున్నారంటే.. అది తారక రత్న సాధించుకున్న అభిమానమే.!
‘పవన్ కళ్యాణ్‌ని బాబాయ్ అనే పిలుస్తాను.. యంగ్ టైగర్ ఎన్టీయార్ నా తమ్ముడు..’ అంటూ ఇటీవలి కాలంలో తారక రత్న చేస్తున్న అత్యంత బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు.. ఆయన్ని అజాత శతృవుగా మార్చేశాయి. తారక రత్న మంచోడు.. అని అంతా అనుకుంటున్న తరుణంలో, ఆయనకిలా అవడం అత్యంత బాధాకరం.
Come on tarak. Love you dear. God bless you my dea.