Switch to English

‘మగతనాన్ని’ చేతికి మొలిపించారు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

వైద్యులు తలుచుకుంటే కానిది ఏముంటుంది? భూలోకంలో ఉండే అపర బ్రహ్మలు వారు. వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత ఎలాంటి విప్లవ మార్పులు చోటుచేసుకున్నాయో చూస్తున్నాం. ఏ అవయవాన్నైనా అవలీలగా మార్పిడి చేసేస్తున్నారు. ఒకప్పుడు గుండె మార్పిడి అంటే ఔరా అనిపించేది. అది ఇప్పుడు చాలా సాధారణమైపోయింది. అయితే, బ్రిటన్ లో చోటుచేసుకున్న ఈ సంఘటన మాత్రం నిజంగా అద్భుతం అనే చెప్పొచ్చు. ఇలాంటి ప్రక్రియ ప్రపంచంలోనే తొలిసారి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇన్ ఫెక్షన్ కారణంగా ఓ వ్యక్తికి అంగం ఊడిపోగా.. వైద్యులు అత్యంత క్లిష్టతరమైన ప్రక్రియతో అతడి చేతికే కొత్త అంగాన్ని మొలిపించి చరిత్ర సృష్టించారు. బ్రిటన్ కు చెందిన మాల్కోలమ్ మెక్ డోనాల్డ్ ఓ మెకానిక్. 2014లో అతడికి ఇన్ ఫెక్షన్ సోకింది. దీంతో అతడి చేతి వేళ్లు, పాదాలు పాడైపోయాయి. క్రమంగా అది అతడి అంగానికి కూడా వ్యాపించింది. కొన్నాళ్ల తర్వాత అది ఊడి కింద పడిపోయింది. కొన్నాళ్లపాటు డోనాల్డ్ అది లేకుండానే జీవించాల్సి వచ్చింది. ఈ క్రమంలో తాగుడుకు బాగా బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో అంగం లేకుండా జన్మించిన ఓ బాలుడికి బయోపెనిస్ ఏర్పాటు చేశారనే సంగతి డోనాల్డ్ కి తెలిసింది.

దీంలో లండన్ యూనివర్సిటీ కాలేజ్ హాస్పటల్ లో పెనిస్ మాస్టర్ గా పేరు పొందిన ప్రొఫెసర్ డేవిడ్ రాల్ఫ్ ని సంప్రదించాడు. డోనాల్డ్ కి కొత్త అంగం సృష్టించడం సాధ్యమేనని.. దానిని తొలుత చేతికి మొలిపించాలని.. అనంతరం దాని స్థానంలో ఏర్పాటు చేయొచ్చని రాల్ఫ్ వివరించారు. ఇందుకు దాదాపు రెండేళ్ల సమయం పడుతుందని చెప్పారు. అలాగే ఈ ప్రక్రియకు దాదాపు 50వేల పౌండ్లు అవుతుందని తెలిపారు. మెకానిక్ అయిన డోనాల్డ్ కి ఎన్ హెచ్ ఎస్ నుంచి ఆ మొత్తం సమకూరింది.

దీంతో రాల్ఫ్ ఈ ప్రక్రియ ప్రారంభించారు. అతడి చర్మాన్ని కొంతమేర తీసుకుని చేతిలో కృత్రిమ అంగాన్ని రూపొందించారు. అది క్రమంగా బయటకు పెరిగేలా ఏర్పాటు చేశారు. దీంతో అది చేతి నుంచి బయటకు మొలిచింది. ఈ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత 2018లో డోనాల్డ్ కి శస్త్రచికిత్స చేసి దానిని ఆ స్థానంలో అతికించాలి. అయితే, ఆ సమయంలో డోనాల్డ్ కి కాస్త అనారోగ్యం రావడంతో శస్త్రచికిత్స వాయిదా పడింది. అప్పటినుంచి ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కరోనా కారణంగా ఆ శస్త్రచికిత్స ఇంకా పెండింగ్ లోనే ఉంది. ప్రస్తుతం డోనాల్డ్ చేతిలో మొలిచిన అంగంతోనే ఉన్నారు. అది బయటకు కనిపించకుండా ఉండేందుకు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుంటారు. ఈ కరోనా కలకలం తగ్గిన తర్వాత కానీ తనకు శస్త్రచికిత్స జరిగే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఆ ప్రక్రియ పూర్తయిపోతే అతడి పేరు రికార్డుల్లోకి ఎక్కుతుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఏప్రిల్ 5న విడుదల...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...