Switch to English

డోనాల్డ్‌ ట్రంప్‌.. ఇండియన్‌ మీడియాలో ఏంటీ ‘కంపు’.!

అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి వచ్చారు.. ఆయనకి అనూహ్యమైన రీతిలో భారతదేశం స్వాగతం పలికింది. ఆసేతుహిమాచలం.. ఆయన రాక పట్ల ఆసక్తి చూపిన మాట వాస్తవం. ట్రంప్‌ ఏం మాట్లాడతారు.? ట్రంప్‌ రాకతో దేశానికి జరిగే మేలు ఏంటి.? ఇలా చాలా చాలా చర్చలు జరిగాయి. అమెరికాలో మనోళ్ళకి ట్రంప్‌ ఏమైనా వరాలు ఇస్తారా.? ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు బలోపేతమయ్యేలా చర్చలు జరుగుతాయా.? వంటి చర్చలు జరగడం సహజమే.

మరోపక్క, అమెరికా అధ్యక్షుడి వాహనాల్ని తెలుసుకోవడానికి ఆసక్తి కనబర్చడమూ తప్పు కాదు. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానం, మెరైన్‌ వన్‌ హెలికాప్టర్లు, బీస్ట్‌ కారు.. వీటి ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు కాబట్టి.. అవన్నీ మనకి చాలా ఆసక్తిని కలిగిస్తాయి. కానీ, ట్రంప్‌ మెడలో ఏ రంగు ‘టై’ కట్టుకుంటే మనకెందుకు.? ట్రంప్‌ సతీమణి మెలానియా వేసుకున్న డ్రస్సు గురించి మనకెందుకు.? ట్రంప్‌ కుమార్తె ఇవాంక ధరించిన డ్రస్సు ఖరీదు ఎంతైతే మనకెందుకు.? దురదృష్టవశాత్తూ ఇతరత్రా అంశాల గురించి కన్నా, పై మూడు అంశాల చుట్టూ ఎక్కువ చర్చ జరుగుతోంది.

పైగా, మీడియాలో ఈ అంశాలపై జరుగుతున్న చర్చ అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. మన మీడియా భావదారిద్య్రానికి ఇదే నిదర్శనమని ఓ రాజకీయ విశ్లేషకుడు మీడియా సాక్షిగా కుండబద్దలుగొట్టేశాడు. ‘అమెరికా – భారత్‌’ మధ్య సన్నిహిత సంబంధాలు ఈనాటివి కాదు.. ఎప్పటినుంచో కొనసాగుతున్నవే. ఈసారి ఇండియా – అమెరికా మధ్య బంధాన్ని మించి ట్రంప్‌ – మోడీ మధ్య బంధం ఎలివేట్‌ అవుతోంది. అది దేశానికి ఏమాత్రం అదనపు ప్రయోజనం చేకూర్చదన్నది ఓ సీనియర్‌ రాజకీయ విశ్లేషకుడి అభిప్రాయం. అందులోనూ నిజం లేకపోలేదు.

అమెరికాలో మన భారతీయుల్ని ట్రంప్‌ ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నాడు.. తనదైన నిర్ణయాలతో. ఈ విషయమై భారత ప్రభుత్వం, అమెరికాతో చర్చించినా, ‘అమెరికా ఫస్ట్‌’ అనే నినాదానికి కట్టుబడిన ట్రంప్‌ మనసు మార్చడం జరిగే పని కాదు. ఇక, పాకిస్తాన్‌ విషయంలో అమెరికా వైఖరి సుస్పష్టం. భారత్‌ కంటే పాకిస్తాన్‌, అమెరికాకి అత్యంత సన్నిహిత దేశం. తీవ్రవాదాన్ని పాకిస్తాన్‌, భారత్‌పైకి ఎగదోస్తోన్నా, అమెరికా మాత్రం పాకిస్తాన్‌పై గట్టిగా మాట్లాడటానికి వెనుకడుగు వేస్తుంటుంది. పాకిస్తాన్‌ – అమెరికా మధ్య ‘బంధం’ అలాంటిది. ఇలాంటి విషయాలపై చర్చ జరిగితే ఏమన్నా ప్రయోజనం వుంటుందేమోగానీ, ట్రంప్‌ మెడలో ‘టై’ గురించిన చర్చ ఏంటి.? మెలానియా, ఇవాంకా డ్రస్సుల గురించిన డిబేట్లు ఏంటి.?

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

పిక్ ఆఫ్ ది డే: అన్నగారు – మెగాస్టార్ @ ఓ మధుర జ్ఞాపకం.!

నేడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి. ఈ సందర్భంగా తెలుగు వారందరూ ఆయనకి సోషల్ మీడియా ద్వారా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పెద్దగా అన్నీ తానై, అందరి...

మళ్లీ అధికారంలోకి వస్తామనే కలలో బతకొద్దంటూ టీడీపీపై నాగబాబు ఫైర్

మెగా బ్రదర్ నాగబాబు ఈరోజు టీడీపీని టార్గెట్ చేశారు. ఈరోజు తన ట్విట్టర్ అకౌంట్లో తనదైన స్టైల్లో టీడీపీపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం టాలీవుడ్ లో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణలా మారిపోయాయి పరిస్థితులు. ఈ...

‘కరోనా’ కేవలం ప్రారంభం మాత్రమే.!

అ!, కల్కి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ మూడో సినిమాతో వచ్చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం కరోనా వైరస్ నేపధ్యంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించిన ప్రశాంత్ నిన్న ఆ చిత్రానికి సంబంధించిన...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...