Prakasam barrage: బెజవాడలోని ప్రకాశం బ్యారేజీని నాలుగు భారీ పడవలు ఢీకొట్టి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. వీటి ధాటికి బ్యారేజీ 67,69,70 గేట్ల వద్ద దాదాపు 17 టన్నుల కౌంటర్ వెయిట్స్ ధ్వంసమయ్యాయి. బ్యారేజీకి భారీ వరద వస్తున్న సమయంలో సెప్టెంబర్ 1న ఈ ఘటన జరగడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది.
ఈ ఘటనలో కుట్ర కోణం ఉందనే ప్రభుత్వం అనుమానాల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఫిర్యాదుతో పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. విచారణలో పడవలకు సంబంధించి ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటిరెడ్డి రామ్మోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విజయవాడ కోర్టుకు తరలించారు. కోర్టు రిమాండ్ తర్వాత కుట్ర కోణంపై దర్యాప్తు మరింత వేగవంతం చేయనున్నారు.
బ్యారేజీకి కొట్టుకొచ్చిన మూడు పడవలపై వైసీపీ రంగులు ఉండటంతో అనుమానాలు రేకెత్తాయి. ఇప్పటివరకూ బోట్ల కోసం యజమానులు రాకపోవడమూ అనుమానాలకు ఊతమిస్తోంది. యజమానుల నిర్లక్ష్యం ఉందా..?, ఉద్దేశపూర్వకంగానే కుట్రకు పాల్పడ్డారా అనే కోణం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.