Switch to English

దేవుడి భూముల అమ్మకం.. దేవుడే రక్షించుకోవాలేమో..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

అసలు హిందూ దేవాలయాలకు పాలక మండళ్ళు ఎందుకు.? దేవాలయాల్ని పరిపాలించడమా.? ఇలాంటి ప్రశ్నలు ఇప్పటివి కాదు. కానీ, ఈ ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకదు. దేవాలయాల్లోనే ప్రసాదాల అమ్మకాలు.. అదీ అధికారికంగా జరుగుతుంటాయి. ప్రభుత్వాలే ఈ అమ్మకాల్ని ప్రోత్సహిస్తుంటాయి. ఇంకే మతంపైనా ప్రభుత్వాలు ఈ తరహా వైపరీత్యాన్ని ప్రదర్శించవు.

దేవాలయాల నుంచి ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం అంతా ఇంతా కాదు. ఓ మోస్తరు దేవాలయాలన్నిటికీ భూములుంటాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో దేవాలయాల్ని అత్యద్భుతంగా నడపొచ్చు. కానీ, టిక్కెట్ల అమ్మకాలతో ఎప్పటికప్పుడు ఆదాయ మార్గాల్ని పెంచుకుంటూ పోతున్నాయి ప్రభుత్వాలు. ఇవన్నీ నాణానికి ఓ వైపు మాత్రమే. భూముల ఆక్రమణలు.. భూముల అమ్మకాలు ఇంకో వైపున్నాయి.

ఆక్రమణల్ని అడ్డుకుంటామంటూ అన్ని ప్రభుత్వాలు చెబుతుంటాయి. చిత్రంగా అధికారంలో వున్నవారే ఎక్కువగా ఆక్రమణలకు పాల్పడుతుంటారు. ఇప్పుడిక అమ్మకాల విషయానికొస్తే, నిరర్ధక ఆస్తులు.. అంటూ వైఎస్‌ జగన్‌ హయాంలో టీటీడీ భూముల అమ్మకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. నిరర్ధక భూములు.. అన్న మాటే దుర్మార్గం.. అంటున్నారు కొందరు. దేవుడి కోసం, దేవాలయాల కోసం భక్తులు ఇచ్చే ఆస్తుల్ని నిరర్ధకం అనడమేంటన్నది వారి వాదన. ఆయా భూముల్ని ప్రభుత్వాలు సంరక్షించుకోలేవా.? ఈ చిన్న లాజిక్‌ని ఎలా అధికార వైసీపీ మిస్‌ అవుతోందో ఏమో.

చంద్రబాబు హయాంలో ఇదే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘దేవుడి భూములు అమ్మితే పాపం..’ అంటూ నినదించారాయన. మరి, ఆ పాపం ఇప్పుడు న్యాయం ఎలా అవుతోందట.? ఇప్పుడు చిన్న చిన్న భూములు మాత్రమే.. ముందు ముందు అవసరాలు పెరిగి, ఏయే పెద్ద భూములు నిరర్ధక ఆస్తులవుతాయో. చివరికి దేవాలయాలూ నిరర్ధక ఆస్తులు మారిపోతేనో.? అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. సోషల్‌ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

తిరుపతి లడ్డూని డిస్కౌంట్‌ ధరలో అమ్మకాలకు తెరలేపిన వైనం చూస్తున్నాం.. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో.. భూముల విక్రయాన్ని ప్రభుత్వం ఇంకా సమర్థించుకోవడం సబబు కాదు. ఏది ఏమైనా దేవుడి భూముల అమ్మకానికి పాలకులు తెరలేపిన దరిమిలా.. ఆ దేవుడే భక్తులు సమర్పించుకున్న భూముల్ని రక్షించుకోవాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...