Switch to English

మొతెరాలో ట్రంప్‌ ‘మోత’: మురిసిపోయిన మోడీ.!

అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధానిని ప్రశంసలతో ముంచెత్తేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా, డోనాల్డ్‌ ట్రంప్‌, ఆ పని చేయడమంటే ప్రపంచమంతా షాక్‌కి గురవ్వాల్సిందే. భారత్‌ – అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు ఈనాటివి కావు. అయినాగానీ, భారత్‌ అంటే అమెరికాకి చాలా చాలా చులకన. ఆ విషయం ట్రంప్‌ మాటల్లో చాలాసార్లు స్పష్టమయ్యింది కూడా. అయినాగానీ, మోడీకీ, ట్రంప్‌కీ ఎక్కడో ఏదో బాగా బలమైన ‘బంధం’ వుంది. ఆ బంధమే, ట్రంప్‌ని.. ఇండియాకి రప్పించింది. అంతే కాదు, నరేంద్ర మోడీ ఘనతని గుక్క తిప్పుకోకుండా ట్రంప్‌తో చెప్పించేలా చేసింది.

కేవలం నరేంద్ర మోడీని పొగిడేందుకే ట్రంప్‌ భారతదేశానికి వచ్చారా.? అని దేశమంతా ఆశ్చర్యపోతోంది. ‘మన ప్రధానిని అమెరికా అధ్యక్షుడు పొగుడుతున్నందుకు’ సగటు భారతీయులంతా గర్వపడాల్సిందే. అచ్చంగా ఇదొక ఎన్నికల ప్రసంగం.. అని ఎవరైనా అనుకోవచ్చుగాక. వారినీ తప్పు పట్టలేం.

నిజమే, ట్రంప్‌ ప్రసంగం కేవలం ఎన్నికల ప్రచార ప్రసంగంలానే సాగింది మరి. 2019 ఎన్నికల్లో నరంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ఇంకోసారి ఘనవిజయం సాధించడాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తావించారు. టీ అమ్మే వ్యక్తి, దేశానికి ప్రధాని అయ్యారనీ మోడీ గురించి చెప్పుకొచ్చారు డోనాల్డ్‌ ట్రంప్‌. ఇంత గొప్ప ఆతిథ్యం తనకు భారత్‌లో లభించడంపై ట్రంప్‌ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ ఆనందంలోనే భారత్‌ – అమెరికా మధ్య అతి పెద్ద బిజినెస్‌ డీల్‌ గురించీ ప్రకటించేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంగా అవతరించిన ‘మోతెరా’ ఈ గొప్ప కార్యక్రమానికి వేదిక అయ్యింది.

‘మేం, నరేంద్ర మోడీకి అమెరికాలో ఫుట్‌బాల్‌ స్టేడియంలో ఆతిథ్యమిచ్చాం.. మీరు నాకు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంలో ఆతిథ్యమిచ్చారు..’ అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌ సినిమాల గురించీ, క్రికెట్‌ లెజెండ్స్‌ గురించీ.. ఇంకా చాలా చాలా విషయాల గురించి ట్రంప్‌ ప్రసంగిస్తోంటే.. భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజలూ ఆసక్తిగా విన్నారు.. కనులారా చూశారు. అయితే, ట్రంప్‌ని పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే, నాలిక మడతేయడంలో ట్రంప్‌ తర్వాతే ఎవరైనా.!

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

టీడీపీకి ఎన్టీఆరే దిక్కు.. కండిషన్స్‌ అప్లయ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు తరహాలోనే ఖాకీ రంగు దుస్తులు ధరించి, రాజకీయ తెరపై కన్పించాల్సిందేనా.? ఆ సమయం ఆసన్నమయ్యిందా.? అంటే, అవుననే అంటున్నారు టీడీపీలో చాలామంది...

దయనీయస్థితిలో బాలీవుడ్ నటుడు

కరోనా నేపథ్యంలో ఇండియాలో పెట్టిన లాక్ డౌన్ వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఆర్ధిక ఇబ్బందులతో చాలా మంది అల్లాడిపోతున్నారు. వారిలో ప్రముఖ హిందీ నటుడు, మహాభారత్ సీరియల్ లో ఇంద్రుడి...

పిక్ ఆఫ్ ది డే: కొమరం భీమ్ కి రామరాజు బర్త్ డే విషెస్.!

మన నవతరం అల్లూరి సీతారామరాజు అలియాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా కొమరం భీమ్ అలియాస్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్పెషల్ బర్త్ డే టీజర్ ని...

క్రైమ్ న్యూస్: గొర్రెకుంట మృత్యుబావి మిస్టరీలో మరో ట్విస్ట్.!

ఈ రోజు ఉదయమే వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో బయటపడిన 9 మృతదేహాల మర్డర్ కి కారణమైన సంజయ్ కుమార్ యాదవ్ నిజానిజాలు ఒప్పుకోవడంతో ఈ మృత్యుబావి మిస్టరీ...

నా ట్వీట్‌ అర్థం చేసుకోమంటూ మెగా బ్రదర్‌ విజ్ఞప్తి

సామాన్యులు సోషల్‌ మీడియాలో ఏం పోస్ట్‌ చేసినా, ఎలాంటి కామెంట్స్‌ చేసినా కూడా పెద్దగా పట్టించుకోరు. కాని సెలబ్రెటీలు మాత్రం ఏ చిన్న పదం ట్వీట్‌ చేసినా కూడా చాలా పెద్ద ఎత్తున...