Switch to English

నరేంద్ర మోడీకి ‘ట్రంప్‌’ కార్డులా ఉపయోగపడ్తుందా.?

అగ్రరాజ్యాధినేతని భారతదేశానికి తీసుకురావడం గొప్ప విషయమే. అయితే, ఇదేమీ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగనిది కాదు. అయితే, ‘నరేంద్ర మోడీ నాకు మంచి మిత్రుడు’ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పడం, రాజకీయంగా నరేంద్ర మోడీకి కాస్త ‘ఊరట’ అనే భావించాలి. కానీ, ఇండియాలో తిని.. పాకిస్తాన్‌కి మేలు చేసినట్లున్నారు అమెరికా అధ్యక్షుడు.. అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.

యుద్ధ హెలికాప్టర్లను భారతదేశానికి విక్రయించేందుకు వీలుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం సంగతెలా వున్నా, ‘ట్రేడ్‌ డీల్‌’ విషయంలోనే గందరగోళం కొనసాగుతోంది. అమెరికా కాకపోతే, ఇంకో దేశం నుంచి యుద్ధ హెలికాప్టర్లను కొనుక్కునే అవకాశం భారతదేశానికి వుంది. సో, ఇదేమీ అంత గొప్ప విషయం కాదు.

ఇదిలా వుంటే, నరేంద్ర మోడీ.. నానా తంటాలూ పడి, ట్రంప్‌ని రప్పించుకున్నారుగానీ, ట్రంప్‌ తనకు పాకిస్తాన్‌ మీద వున్న అభిమానాన్ని భారతదేశంంలో చెప్పడం, పాకిస్తాన్‌కి లాభించే అంశమంటూ పాకిస్తాన్‌ మీడియా కథనాల్ని వండి వడ్డిస్తోంది. అయితే, పాకిస్తాన్‌ని తీవ్రవాద దేశంగా ట్రంప్‌ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు, భారతదేశంలో పర్యటించినప్పుడూ అదే మాట చెప్పారు. అది పాకిస్తాన్‌ చెవిన పడలేదు, పడదు కూడా.

పాక్‌ సంగతి పక్కన పెడితే, ట్రంప్‌.. భారత పర్యటనతో దేశానికి ఒరిగిందేమీ లేదు. ట్రంప్‌ సేవలో మోడీ సర్కార్‌ మునిగి తేలడంతో.. దేశ రాజధాని ఢిల్లీలో అనూహ్యంగా అల్లర్లు చెలరేగాయి. 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ అల్లర్లలో. కనీ వినీ ఎరుగని స్థాయిలో విధ్వంసం చోటు చేసుకుంది ఢిల్లీలో. దీనికి నైతిక బాధ్యత వహించాల్సింది ఎవరు.? కేంద్ర హోంమంత్రిగా అమిత్‌ షానే బాధ్యత తీసుకోవాలి.

అదే విషయాన్ని విపక్షాలు ప్రస్తావిస్తే, ‘ఇలాంటి నీఛ రాజకీయాలు చేయడం తగదు’ అంటూ విపక్షాలపై దుమ్మెత్తి పోసేస్తోంది అధికార పక్షం. నిజానికి, ట్రంప్‌ పర్యటన సందర్భంగా అల్లర్లు జరిగేందుకు అధికార బీజేపీ ఆస్కారమిస్తుందని అనుకోలేం. కానీ, నిర్లక్ష్యం ఇక్కడ సుస్పష్టం. ట్రంప్‌ వచ్చాడన్న ఆనందం బీజేపీకి ఒక్క రోజు కూడా మిగల్లేదు. ఆ స్థాయిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లపై అందరి ఫోకస్‌ పడింది. బీజేపీకే కాదు.. దేశానికే మాయని మచ్చగా మిగిలిపోతుంది ఢిల్లీలో తాజా అల్లర్ల వ్యవహారం. ఎలా చూసినా.. ట్రంప్‌ ఎపిసోడ్‌, బీజేపీకి.. ప్రధాని నరేంద్ర మోడీకీ అతి పెద్ద ఎదురు దెబ్బలానే భావించాల్సి వుంటుంది.

సినిమా

మెగాస్టార్ రీమేక్ లోకి జగ్గూ భాయ్.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా కారణంగా బ్రేక్ పడిన...

మరో స్పెషల్ రికార్డ్ కొట్టేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు నచ్చిన సినిమాల గురించి పోస్ట్ చేయడం...

మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండేలా లేదుగా.!

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ సమయంలో రాజమౌళిని...

లెజండరీ దర్శకుడితో విక్టరీ వెంకటేష్?

దర్శకుడిగా కె రాఘవేంద్రరావు తెలుగు సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా కమర్షియల్ ఫార్మటును కొత్త పుంతలు తొక్కించి రాఘవేంద్రరావు ఎన్నో మరపురాని విజయాలను...

స్పెషల్‌: స్టార్ హీరోతో రెజీనా షార్ట్ ఫిల్మ్

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రెజీనా. ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోవడం తో వెబ్ సిరీస్...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఇళ్ళ పట్టాల పేరుతో వైసీపీ నేతలు దోచేస్తున్నారా.?

జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో అదే రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత కొద్ది నెలలుగా...

మళ్ళీ లాక్‌డౌన్‌.. హైద్రాబాద్‌పై ఏంటీ గందరగోళం.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో మళ్ళీ కరినంగా లాక్‌డౌన్‌ అమలు కాబోతోందట.! గత కొద్ది రోజులుగా విన్పిస్తోన్న ఈ ఊహాగానాలు సగటు హైద్రాబాదీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. ‘హైద్రాబాద్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది’...

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై ఈడీ కేసు

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఈ...

వైసీపీకి మళ్ళీ ‘పీకే’ అవసరం ఎందుకొచ్చినట్లు.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ప్రశాంత్‌ కిషోర్‌ ‘అవసరం’ వచ్చిందట. గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితిపై ‘పీకే’ టీమ్ తో అంచనా వేయించి, పరిస్థితులు తేడాగా వుంటే సరిదిద్దుకునేందుకు పార్టీ...

ఏపీ కరోనా టెస్టుల్లో విశ్వసనీయత ఎంత.?

కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత ఒకరు తనకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్ట్‌ జరిగితే పాజిటివ్‌ అని తేలిందనీ.. అదే తెలంగాణలో టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌గా తేలిందనీ ఆరోపిస్తూ.. కొన్ని ఆధారాల్ని తెరపైకి...

ఎక్కువ చదివినవి

నాని సరసన తెలుగమ్మాయిని కన్సిడర్ చేస్తున్నారా?

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆగస్ట్...

ఇష్టానుసారంగా ఏపీకి వచ్చేందుకు వీలు లేదు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్‌లాక్‌ 2.0 లో భాగంగా అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతులు అక్కర్లేదు అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏపీకి...

ఎక్స్ క్లూజివ్: భారీ రిస్క్ చేస్తున్న అల్లరి నరేష్ ‘నాంది’ నిర్మాత.!

'మహర్షి' సినిమాలో కనిపించి తన నటనతో మెప్పించిన అల్లరి నరేష్‌ హీరోగా చేస్తున్న సినిమా 'నాంది'. 'ఎ న్యూ బిగినింగ్' అనేది ఈ సినిమాకు ఉప‌శీర్షిక‌. ఇప్పటికే రిలీజైన రియలిస్టిక్ ఫస్ట్ లుక్...

జూలై 10 వరకు అచ్చెన్నాయుడి రిమాండ్ పొడిగింపు

ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడితో అవినీతి నిరోధక శాఖ విచార‌ణ ముగిసింది. గతంలో ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా అది ఈ సాయంత్రంతో ముగిసింది. దాంతో,...

అల్లరి నరేష్ ‘నాంది’ టీజర్ రివ్యూ: న్యాయానికి ఇన్నేళ్లు ఎందుకు?

కామెడీ సినిమాలతో క్రేజ్, మార్కెట్ ఏర్పరుచుకున్న అల్లరి నరేష్ మధ్య మధ్యలో తన రూట్ కు భిన్నంగా విభిన్నమైన సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా చేసిన ప్రతీసారి అల్లరి నరేష్ నటనకు అద్భుతమైన...