Switch to English

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని నినదిస్తోంది. ఔను, ఆ తెలుగు తల్లి ఇప్పుడు సంతోషిస్తుంది. తన నుంచి తెలంగాణ తల్లిని వేరు చేసిన గులాబీ రాజకీయం, ఇన్నాళ్ళకు తనను గుర్తించిందని తెలుగు తల్లి ఆనంద భాష్పాలు విడుస్తుంది.

తెలుగు తల్లి అంటే ఓ వ్యక్తి కాదు, ఓ భావన. తెలుగు ప్రజలందరికీ తల్లి అని. తెలంగాణ తల్లి ఎందుకు వుండకూడదు.? కృష్ణమ్మ, గోదారమ్మ.. ఇలా పేర్లు పెట్టుకుంటాం. ‘అమ్మ’ అనేది ఓ భావన. ఆ భావనకి సైతం రాజకీయం అద్ది, విద్వేషాలు పులిమి.. తెలంగాణ ఉద్యమంలో నానా యాగీ చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి.

అది గతం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మారిపోబోతోంది. భారత రాష్ట్రీయ సమితి అవుతుందట. తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నట్లే, తెలుగు పార్టీ జాతీయ రాజకీయాల్లో దుమ్ము రేపుతుందంటూ తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించేశారు.

తెలుగు నేల గర్వించదగ్గ విషయమే ఇది. నిజానికి, స్వర్గీయ నందమూరి తారకరామారావు జాతీయ రాజకీయాల్ని శాసించారు. ఆ తర్వాత నారా చంద్రబాబునాయుడు కూడా జాతీయ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. అటు ఎన్టీయార్, ఇటు చంద్రబాబు.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళకుండానే, జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేశారు.

ఆ స్థాయిలో తెలుగు నేల పైనుంచి జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేయగలిగిన నాయకుడు ఇంకొకరు రాలేదనడం అతిశయోక్తి కాదు. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళకి తెలుగు నేల పైనుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, జాతీయ పార్టీ పెట్టి, జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేస్తానంటే తెలుగు నేల తరఫున హర్షం వ్యక్తం చేయాల్సిందే.

కానీ, అందుకు ముందుగా కేసీయార్, తెలుగు రాష్ట్రాలపై తనదైన ముద్ర వేయాలి. తెలంగాణలో కేసీయార్‌కి తిరుగు లేదు. మరి, ఆంధ్రప్రదేశ్ మాటేమిటి.? పోలవరం విషయమై కేసీయార్‌ది రెండు నాల్కల ధోరణి. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ, విద్యుత్ పంచాయితీ.. ఇవి ఓ కొలిక్కి రాలేదు. వచ్చే అవకాశమూ కనిపించడంలేదు.

ముఖ్యమంత్రిగా పొరుగు రాష్ట్రంతో నీటి పంచాయితీ, విద్యుత్ పంచాయితీనే సెటిల్ చేసుకోలేని కేసీయార్, జాతీయ రాజకీయాల్ని ఎలా ప్రభావితం చేయగలుగుతారు.? కాస్త ఆలోచించాల్సిన విషయమే. అన్ని సినిమాలూ పాన్ ఇండియా సినిమాలు అనిపించుకోలేవ్.! అలాగే, రాజకీయ పార్టీలు కూడా.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా ముందుకు తీసుకెళ్తే సమాజం శెభాష్ అంటుంది....

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...