అదంతా టీ కప్పులో తుఫానేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,684FansLike
57,764FollowersFollow

సాధారణంగా మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు లేదా నామినేటెడ్ పదవుల పంపిణీ జరిగినప్పుడు అధికార పార్టీలో అసంతృప్తి రావడం సహజం. వాటిని సరిగ్గా పరిష్కరించడంలోనే ఆ పార్టీ అధినేత శక్తి సామర్థ్యాలు, వ్యూహాలు ఏమిటనే సంగతి తెలుస్తుంది. తాజాగా తెలంగాణ కేబినెట్ విస్తరణ అనంతరం పలువురు నేతలు బాహటంగానే తమ అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీనే నమ్ముకున్న తమకు అన్యాయం చేశారని, గులాబీ జెండాలకు తాము కూడా ఓనర్లమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీలో ఓనర్లు-కిరాయిదారులు అనే నినాదం పెరిగింది. మంత్రి ఈటల రాజేందర్ తో మొదలైన వ్యవహారం.. అలా కొనసాగింది. రసమయి బాలకిషన్, నాయిని నర్సింహారెడ్డి బహిరంగంగానే తమ అసమ్మతి గళం వినిపించారు. ఇక టి.రాజయ్య, జోగు రామన్న, మైనంపల్లి హనుమంతరావు, జూపల్లి కృష్ణారావు, బాజిరెడ్డి గోవర్థన్, అరికెపూడి గాంధీ కూడా కేబినెట్ విస్తరణలో తమకు చోటు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తంచేసినట్టు వార్తలొచ్చాయి.

Also Read: కేసీఆర్: ఆల్ ఈజ్ నాట్ వెల్

వీరిలో ముగ్గురు నేతలు బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. దీంతో అప్రమత్తమైన పార్టీ అధిష్టానం.. వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగి.. వారందరితో విడివిడిగా మాట్లాడారు. అన్ని విధాలా అండగా ఉంటామని, వారి ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. అదే సమయంలో ఒకవేళ పార్టీని వీడి బీజేపీలో చేరితే వెంటనే వారి శాసనసభ సభత్వం రద్దవుతుందని, అంతేకాకుండా వారిపై గతంలో ఉన్న కేసులు తెర పైకి వస్తాయని హెచ్చరించినట్టు తెలుస్తోంది.

దీంతో రాజయ్య, జూపల్లి, బాజిరెడ్డి, జోగు రామన్న మీడియా ముందుకు వచ్చి తమపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాము టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని, పార్టీకి విధేయంగా ఉంటామని పేర్కొన్నారు. మైనంపల్లి కూడా ఈ విషయంపై ఇదే విధంగా స్పందించే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తమ్మీద కేబినెట్ విస్తరణ తర్వాత ఒక్కసారిగా లేచిన అసమ్మతి జ్వాలలను వెంటనే తగ్గించడంలో టీఆర్ఎస్ అగ్రనేతలు విజయం సాధించారు.

9 COMMENTS

సినిమా

Pawan Kalyan: అభిమాని గురించి పవన్ భావోద్వేగ పోస్ట్..! బండ్ల గణేశ్...

Pawan Kalyan: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన 17ఏళ్ల నిరంజన్ ను నేటి ఉదయం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలుసుకున్న...

Pawan Kalyan: ‘పవన్ కల్యాణ్’ను కలవాలి..! బాలుడి కోరిక నెరవేర్చిన పవర్...

Pawan Kalyan: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు ఉదయం వరంగల్ జిల్లా హనుమకొండ విచ్చేశారు. స్థానికంగా నివసించే పవన్ కల్యాణ్...

పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి:...

తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు....

రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా? ఈ ఉదాహరణలే చర్చకు కారణం!

'RRR’ సమయంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం, బాండింగ్, బ్రదర్‌హుడ్ గురించి ఇద్దరూ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే రామ్...

ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల మైలురాయి.. బాక్సాఫీస్ చరిత్రలో చిరంజీవి–రామ్ చరణ్...

బాక్సాఫీస్ చరిత్రలో కలెక్షన్ల గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మరోసారి ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే...

రాజకీయం

సాయికృష్ణ కేసులో సీఎం సీరియస్.. సీఐ సస్పెన్షన్‌కు ఆదేశం

సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం...

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కి పశ్చాత్తాపమెందుకు కలగలేదు.?

రాజకీయ నాయకులన్నాక దిగజారిపోవాలా .. దిగజారుడు మాటలే మాట్లాడాలా ..   ఏమో, అంతేనేమో.! చెల్లెలు వైఎస్ షర్మిల కట్టుకున్న చీర రంగు మీద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన  వ్యాఖ్యల్ని...

సీఎం ఇచ్చిన మాట.. సత్యనారాయణ ఇంటి కలకు శ్రీకారం

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు పడ్డాయి. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఒక సాధారణ...

భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిరంజన్ కోసం పవన్ ప్రత్యేక పూజలు

అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని నిరంజన్ ఆరోగ్యం కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమాని ఆరోగ్యం...

మంగళగిరిలో అభివృద్ధి వేగం.. ఒకేరోజు నాలుగు కీలక ప్రాజెక్టులకు లోకేష్ శ్రీకారం

మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగం పుంజుకున్నాయి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒకేరోజు నాలుగు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కేంద్ర సహాయ మంత్రి...

ఎక్కువ చదివినవి

పెద్ది చిత్రానికి మరో కొత్త ఆకర్షణ.. బుధవారం నుంచి ఎక్స్‌టెండెడ్ కట్

ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న పెద్ది సినిమాకు ఇప్పుడు మరో ప్రత్యేక ఆకర్షణ జోడించబడుతోంది. చిత్ర బృందం తాజా ప్రకటన ప్రకారం, బుధవారం నుంచి థియేటర్లలో ఎక్స్‌టెండెడ్ కట్ ప్రదర్శించనున్నారు. ఈ కొత్త...

వెన్నుపోటు ఎవరు చేశారు?.. వైసీపీపై అప్పసాని రాజేష్ విమర్శలు

ఏపీలో ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో వైసీపీపై,  తెలుగుదేశం  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రెండేళ్ల నమ్మకం,...

Chiranjeevi-Suhasini: మణిరత్నం సినిమాలో ఆ సన్నివేశానికి చిరంజీవే స్ఫూర్తి: సుహాసిని

Chiranjeevi-Suhasini: తెలుగులో అత్యధిక సినిమాల శతదినోత్సవాలు జరిపిన హీరోగా మెగాస్టార్ చిరంజీవిదే రికార్డు. విజేత మొదలు ఎన్నో సినిమాలకు ఆయన అనేక పట్టణాలు, నగరాల్లో తన సక్సెస్ సినిమాలకు శతదినోత్సవాలు జరిపారు. గ్యాంగ్...

ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల మైలురాయి.. బాక్సాఫీస్ చరిత్రలో చిరంజీవి–రామ్ చరణ్ అరుదైన ఘనత

బాక్సాఫీస్ చరిత్రలో కలెక్షన్ల గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మరోసారి ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే సంవత్సరంలో తండ్రి–కొడుకుల సినిమాలు విడుదలై, రెండూ...

పెద్ది బ్లాక్‌బస్టర్ తర్వాత జాన్వీ కపూర్‌కు రూ.8 కోట్ల పారితోషికం!

పెద్ది చిత్రానికి హీరోయిన్ జాన్వీ కపూర్‌కు తొలుత రూ.6 కోట్ల పారితోషికం ఖరారు చేసినట్లు సమాచారం. అయితే సినిమా విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఆమెకు తుది సెటిల్‌మెంట్‌గా రూ.8 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది....