జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించేందుకు సిద్దం అయ్యారు. ఉదయం హైదరాబాద్ నుండి ఎల్బీ నగర్ మీదుగా చౌటుపల్ సమీపంలో ఉండే లక్కారం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ కొంగర సైదులు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించబోతున్నారు. ఆ తర్వాత కోదాడ వెళ్లి అక్కడ కడియం శ్రీనివాసరావు కుటుంబంను పరామర్శించి చెక్కులను పంపిణీ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ రాకతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జనసైనికులు హడావుడి చేస్తున్నారు.
తెలంగాణ లో జనసేన కు పెద్దగా కార్యకర్తలు లేరు అనే అభిప్రాయం ఉంది. అది నిజం కాదు అనే విషయాన్ని నిరూపించేందుకు గాను కార్యకర్తలు భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ కార్యక్రమాలకు తరలి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్లగొండ పర్యటన పట్ల టీఆర్‌ఎస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన గెస్ట్ గా వచ్చి తెలంగాణ ప్రజలను పలకరించడం మామూలు అయ్యింది. ఆయన పబ్లిసిటీ కోసం నల్లగొండ పర్యటన చేపట్టాడు అంటూ టీఆర్‌ఎస్ నాయకులు పెదవి విరుస్తున్నారు.