Switch to English

జగన్ ను వాళ్ళు మాత్రమే పిలుస్తారట.. సోషల్ మీడియాలో వైరల్

వైఎస్ జగన్ పై క్విడ్ ప్రోకో… అక్రమాస్తుల కేసులు ఎన్నో ఉన్నాయి. అన్నింట్లో కూడా మొదటి ముద్దాయిగా జగన్ ఉన్నారు. ఈ కేసులకు సంబంధించిన విచారణ హైదరాబాద్ సిబిఐ కోర్టులో జరుగుతున్నది. రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత నుంచి ఈ కేసు నడుస్తూనే ఉన్నది. ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదు. విచారణ ఇంకెన్నాళ్లు ఉంటుందో తెలియదు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరయ్యేవారు.

ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారే కోర్టుకు వచ్చారు. ఆ తరువాత మరలా వెళ్ళలేదు. ఈ కేసులో జగన్ బెయిలు మాత్రమే మంజూరు అయ్యింది. ఒకవేళ ఈ కేసుకు సంబంధించిన బెయిలును కోర్టు క్యాన్సిల్ చేస్తే పరిస్థితి ఏంటి. మరలా జైలుకు వెళ్లాల్సిందేనా లేదంటే మరలా బెయిల్ తెచ్చుకోవాలా? ఈ విషయాలను పక్కన పెడితే ఇప్పుడు జగన్ పై కొన్ని మీమ్స్ సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

ట్రంప్ ఇండియాకు వస్తున్నారు. మంగళవారం అంటే ఫిబ్రవరి 25 వ తేదీన ట్రంప్ కు రాష్ట్రపతి భవన్ లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యమ్రమానికి 95 మంది అతిధులను ఆహ్వానిస్తున్నారు. ఈ 95 మందిలో జగన్ స్నేహితుడు, సహచర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు. కేసీఆర్ కు ఆహ్వానం అందడంతో, అయన ట్రంప్ కోసం కొన్ని స్పెషల్ రెసిపీలు తయారు చేయించి గిఫ్ట్ గా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

కానీ, జగన్ కు మాత్రం ఆహ్వానం అందలేదు. ఒక విధంగా చెప్పాలి అంటే, కేసీఆర్ కంటే కూడా కేంద్రానికి జగన్ దగ్గరగా ఉన్నారు. బీజేపీతో త్వరలోనే చేతులు కలుపుతారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ ను పక్కన పెట్టి కేసీఆర్ కు ఆహ్వానం పలకడంతో వైకాపా నేతలు షాక్ అవుతున్నారు. దీనిపై కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మమ్మల్ని సీబీఐ తప్ప మరెవ్వరు పిలవరు అని కొన్ని మీమ్స్ విపరీతంగా షేర్ అవుతున్నాయి.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

భారీ బడ్జెట్ వెనక్కి – తెలంగాణ ఫిల్మ్ ముందుకి @ నాని

యంగ్ హీరో నాని సినిమాలు చేయడంలో చాలా దూకుడుగా వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నన్ను ఒక సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సినిమాకి సంబందించిన అన్నీ రెడీ చేసుకుంటారు, ఈ...

బ్రేకింగ్ న్యూస్: 12 గంటల్లో ఢిల్లీలో రెండు భారీ అగ్ని ప్రమాదాలు.!

సోమవారం అర్ధరాత్రి 12 గంటల 50 నిమిషాలకి ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ మురికివాడలో మంటలు చెలరేగాయి.ఈ మంటలు సుమారు రెండు ఎకరాల మేర వ్యాపించడంతో అక్కడున్న దాదాపు 1500 గుడిసెలు ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై మాట్లాడడానికి భయపడే హీరోయిన్ల ఆలోచనలో క్రమంగా...

సీఎం జగన్‌ 2020 క్యాలెండర్‌ అదిరిందిగానీ.!

సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌, మిగతా రాష్ట్రాలతో పోల్చితే ముందంజలో వుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతోంది. విభజన నేపథ్యంలో ఏర్పడ్డ కష్టాలు...

తిరుపతి లడ్డూ అమ్మకంపై రమణ దీక్షితులు అసహనం

రమణ దీక్షితులు.. చంద్రబాబు హయాంలో ‘ఉద్యోగం’ కోల్పోయిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడీయన. అప్పట్లో రమణ దీక్షితులు చేసిన పొలిటికల్‌ యాగీ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఆయన అప్పటి ప్రతిపక్ష...