Switch to English

ఎన్టీఆర్‌ బర్త్‌డేకు త్రివిక్రమ్‌ గిఫ్ట్‌పై క్లారిటీ

మరో రెండు వారాల్లో ఎన్టీఆర్‌ బర్త్‌డే రాబోతుంది. ఆయన బర్త్‌డే కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా భారీ వేడుకలు సాధ్యం కాకపోవచ్చు. కాని సోషల్‌ మీడియాలో మాత్రం పెద్ద హంగామా సృష్టించాలనే ఉద్దేశ్యంతో ఫ్యాన్స్‌ రెడీ అవుతున్నారు. ఇప్పటికే కౌంట్‌ డౌన్‌ షురూ చేశారు. ఎన్టీఆర్‌ బర్త్‌డేకు ఖచ్చితంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం నుండి కొమురం భీమ్‌ వీడియో కాని, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కాని రానుంది. జక్కన్న ఇచ్చే ఆ సర్‌ప్రైజ్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎన్టీఆర్‌ చేయబోతున్న చిత్రంకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. రాధాకృష్ణ మరియు కళ్యాణ్‌ రామ్‌లు ఆ సినిమాను నిర్మించబోతున్నారు. ఎన్టీఆర్‌ 30 గా ఇప్పటికే సోషల్‌ మీడియా ఆ సినిమా ట్రెండ్‌ అవుతూనే ఉంది. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా దర్శకుడు త్రివిక్రమ్‌ ఎన్టీఆర్‌ 30కి సంబంధించిన ఒక సర్‌ప్రైజ్‌ను ప్లాన్‌ చేశాడంటూ వార్తలు వచ్చాయి. ఆ సర్‌ప్రైజ్‌ ఏంటీ అనే విషయమై పలువురు పలు రకాలుగా అనుకున్నారు. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం టైటిల్‌ను రివీల్‌ చేయబోతున్నట్లుగా ఊహిస్తున్నారు.

తాజాగా ఎన్టీఆర్‌ 30కి సంబంధించిన పుకార్లపై చిత్ర పీఆర్‌ టీం స్పందించింది. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ 30కి సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షూటింగ్‌ కూడా ఎప్పుడు మొదలు పెట్టేది లాక్‌డౌన్‌ పూర్తి అయ్యి ఆర్‌ఆర్‌ఆర్‌ నుండి ఎన్టీఆర్‌ వచ్చిన తర్వాత త్రివిక్రమ్‌ నిర్ణయించుకుంటాడు. అప్పటి వరకు ఎవరికి తోచిన ఊహలు వారు చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. వారి ప్రకటనతో నందమూరి ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: యువకుడి ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం

ప్రేమ వ్యవహారం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మెదక్ జిల్లా నిజాం పేట మండలం రాంపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తమ అమ్మాయిని ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నారు అంటూ...

ఫ్లాష్ న్యూస్: లారీ క్యాబిన్‌లో ఉరి వేసుకున్న డ్రైవర్‌

నెలన్నర రోజుల తర్వాత ఎట్టకేలకు లారీలు రోడ్డు ఎక్కాయి. ఈ సమయంలో ఆర్థికంగా డ్రైవర్లు చితికి పోయారు. వారి జీవితం ఆందోళనకరంగా మారింది. ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవతున్నారు. ఆ...

నా ట్వీట్‌ అర్థం చేసుకోమంటూ మెగా బ్రదర్‌ విజ్ఞప్తి

సామాన్యులు సోషల్‌ మీడియాలో ఏం పోస్ట్‌ చేసినా, ఎలాంటి కామెంట్స్‌ చేసినా కూడా పెద్దగా పట్టించుకోరు. కాని సెలబ్రెటీలు మాత్రం ఏ చిన్న పదం ట్వీట్‌ చేసినా కూడా చాలా పెద్ద ఎత్తున...

లాక్‌డౌన్‌ ఆత్మహత్యల లెక్కెంత?

కరోనా వైరస్‌ కారణంగా దేశంలో మృతి చెందినవారి సంఖ్య 3 వేలు దాటింది. మరోపక్క, లాక్‌డౌన్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరిగిపోతోంది. రోడ్డు ప్రమాదాలు, ఆకలి చావులు.. ఇలా...

గాడ్సేపై నాగబాబు ట్వీట్‌: జనసేనకు కొత్త తలనొప్పి

మహాత్మాగాంధీని చంపేశాడు గనుక, నాథూరామ్ గాడ్సే మంచోడు కాదు. చరిత్ర మనకి చెప్పేది ఇదే. జాతి పిత మహాత్మాగాంధీని అభిమానించేవారెవరూ గాడ్సేని పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించరు. ఇది చరిత్ర చెబుతోన్న సత్యం....