ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్ ఎవరు.. ఎవరి వల్ల పనులు అవుతాయి అంటే చాలా మంది ఏ దిల్ రాజు పేరో లేదంటే ఇంకా ఏ పెద్ద నిర్మాత పేరో చెబుతారు. కానీ వీరెవరూ కాదు. అందరికన్నా పవర్ ఫుల్ పర్సన్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. యస్.. ఎందుకంటే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ లో పవన్ కల్యాణ్ అత్యంత పవర్ ఫుల్ గా ఉన్నారు. పైగా సినిమాలకు సంబంధించిన విషయాలు మొత్తం చూసుకునే పవర్ ను పవన్ కల్యాణ్ కు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇక పవన్ తనకు అత్యంత నమ్మకస్తుడు, సన్నిహితుడు అయిన త్రివిక్రమ్ ను సినిమా ఇండస్ట్రీ సంబంధింత విషయాలు చూసుకునే బాధ్యతను ఇచ్చాడంట.
అంటే ఇండస్ట్రీలో ఎవరికి ఏం కావాలన్నా సరే ముందు త్రివిక్రమ్ దగ్గరకు వెళ్తేనే తర్వాత పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లగలరు. అన్నీ త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకుంటున్నాడంట. మొన్న కల్కి సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కూడా నిర్మాత అశ్వినీ దత్ ముందు త్రివిక్రమ్ ను కలిశాడు. త్రివిక్రమ్ సాయంతోనే పవన్ వద్దకు వెళ్లి టికెట్ల రేట్లు పెంచుకున్నారు. ఇప్పుడు దేవర సినిమా విషయంలో జరిగింది కూడా ఇదే. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప-2 విషయంలో కూడా అందరి చూపు త్రివిక్రమ్ మీదనే ఉంది. బన్నీ, పవన్ మధ్య ఇప్పుడు విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
ఇక పుష్ప-2 నిర్మాతలకు త్రివిక్రమ్ కు మంచి సంబంధాలు లేవు. కానీ బన్నీ తర్వాత సినిమాను త్రివిక్రమ్ తోనే తీయబోతున్నాడు. దాంతో త్రివిక్రమ్ ఈ సమస్యను పరిష్కరిస్తాడా లేదా అనేది అంతా ఎదురు చూస్తున్నారు. ఇలా ఇండస్ట్రీ విషయాలను పరిష్కరించడంలో త్రివిక్రమ్ పవర్ ఫుల్ గా మారిపోయాడు. అలా అని త్రివిక్రమ్ కు అధికారికంగా ఎలాంటి పవర్స్ లేవు. కానీ పవన్ తన మీద ఉంచిన నమ్మకంతోనే త్రివిక్రమ్ ఇలా పవర్ ఫుల్ గా మారిపోయాడు.