పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ తో కూడా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. పుష్ప తర్వాత అసలైతే త్రివిక్రం తో బన్నీ సినిమా చేయాల్సి ఉంది. అల్లు అర్జున్ త్రివిక్రం ఇప్పటికే మూడు సినిమాలు తీసి మూడింటితో హిట్ అందుకున్నారు. ఇక నెక్స్ట్ తీయబోయే సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రం తోనే సినిమా చేస్తాడని నిన్న మొన్నటిదాకా అనుకున్నారు.
కానీ ఇప్పుడు రేసులో మరో దర్శకుడు వచ్చి చేరాడు. తమిళ దర్శకుడు అట్లీ అల్లు అర్జున్ తో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. కోలీవుడ్ లో విజయ్ తో సినిమా చేసి ఆ క్రేజ్ తో బాలీవుడ్ షిఫ్ట్ అయిన అట్లీ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. జవాన్ తర్వాత అట్లీ రేంజ్ మారిపోయింది. బాలీవుడ్ స్టార్స్ అతనితో సినిమాకు రెడీ అంటున్నారు.
జవాన్ తర్వాత అట్లీ సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తాడని టాక్ వినిపించింది. ఆమధ్య బేబీ జాన్ ఈవెంట్స్ లో కూడా అట్లీ ఆ విషయాన్ని వెల్లడించాడు. ఐతే మధ్యలో ఏమైందో ఏమో కానీ అట్లీ ఆ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. సల్మాన్ ని కాదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాకు రెడీ అవుతున్నాడట. ఆల్రెడీ బన్నీతో కథా చర్చలు జరిగాయని టాక్.
మరి అట్లీ, త్రివిక్రం వీరిలో ఎవరితో ముందు అల్లు అర్జున్ సినిమా చేస్తాడన్నది క్లారిటీ రాలేదు. త్రివిక్రం సినిమా ఈసారి చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అందుకే ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా చాలా టైం తీసుకుంటుంది. అందుకే ఆ గ్యాప్ లో అట్లీ సినిమా పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట అల్లు అర్జున్. మరి అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఎలా ఉంటుంది..? ఎలాంటి కథతో వీరు వస్తారన్నది చూడాలి.