Trisha: ముగ్గురు హీరోల లక్కీచార్మ్ ‘త్రిష..’ ఆ మూడు సినిమాల్లో ఆమెనే హీరోయిన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,220FansLike
57,764FollowersFollow

Trisha: సినిమాకో కొత్త హీరోయిన్ వస్తున్న రోజుల్లో దాదాపు 25ఏళ్లుగా హీరోయిన్ గా రాణించడమంటే ఆషామాషీ కాదు. ఇంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్న అతితక్కువ హీరోయిన్లలో ఒకరు ‘త్రిష’. చెన్నై చందమామగా పిలిపించుకుని ఓదశలో తెలుగు, తమిళ భాషల్లో నెంబర్ వన్ హీరోయిన్ గానూ రాణించారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ గ్యాప్ లేకుండా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూ ఏకంగా లక్కీచార్మ్ అనిపించుకుంటున్నారు. ఇటివలే ఆమె నటించిన తమిళ సినిమా కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సెన్సేషనల్ హిట్ అయింది.

ఇప్పుడిదే త్రిషను మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. తమిళంలో ముగ్గురు స్టార్ హీరోలతో ఆమె నటించిన రీసెంట్ ఫిల్మ్స్ అన్నీ ఆయా హీరోల కెరీర్లో బ్లాక్ బస్టర్స్ గా, హయ్యస్ట్ రెవెన్యూ సినిమాలుగా నిలవడంతో అందరూ త్రిషను లక్కీ చార్మ్ గా పిలుస్తున్నారు. ఓ అభిమాని ఈ విషయాన్ని ఫొటోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో త్రిష సైతం స్పందించారు. ఈ పోస్ట్ ను త్రిష తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి లవ్ ఎమోజీతో థ్యాంక్స్ చెప్పారు.

2023లో విజయ్ తో ఆమె నటించిన ‘లియో’ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా ఏకంగా రూ.600కోట్లు వసూలు చేసిందని టీమ్ ఆమధ్య ప్రకటించింది.

2025లో అజిత్ తో నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఆయన కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. ఈసినిమా దాదాపు 250కోట్లు వసూలు చేసిన అజిత్ కెరీర్ హయ్యస్ట్ గా నిలిచింది.

2026లో సూర్య నటించిన సినిమా కరుప్పు. వరుస ఫ్లాపుల్లో ఉన్న సూర్యకు ఈ సినిమా సూపర్ హిట్టై మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా రూ.300కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోందని టాక్.

ఇలా ఈ హీరోలందరికీ వారి కెరీర్ హయ్యస్ట్ రెవెన్యూ సినిమాలో హీరోయిన్ త్రిష కావడం విశేషం. దీంతో ఆమె ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో త్రిష ‘విశ్వంభర’లో నటిస్తున్నారు.

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

ఎక్కువ చదివినవి

మీ కుటుంబ సభ్యులను ఎవరైనా దూషిస్తే మీరు ఊరుకుంటారా?: అఖిల్ రాజ్ క్లారిటీ

'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి ఇటీవల ఓ డెలివరీ బాయ్‌తో జరిగిన ఘర్షణ కారణంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే....

తిరుమలలో పవన్ కళ్యాణ్.. స్వామివారి దర్శనం తర్వాత పెళ్లి వేడుకలో పాల్గొన్నారు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో వీబీజీ–రామ్‌జీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసిన అనంతరం నేరుగా తిరుమలకు...

ఉద్యోగాల కోసం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే వారిగా ఎదగండి: లోకేష్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన జాతీయ విద్యా విధానం, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, వికసిత్ భారత్–2047 వంటి కార్యక్రమాలు దేశాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తున్నాయని, అదే స్ఫూర్తితో...

అల్లూరి ఆశయాలే దేశానికి స్ఫూర్తి: పవన్ కళ్యాణ్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన సందేశంలో అల్లూరి...

ప్రకృతే శాశ్వత సంపద: 18 నగర వనాలను ప్రారంభించిన పవన్ కళ్యాణ్

ప్రకృతితో కలిసి సాధించే అభివృద్ధే శాశ్వతమని, భవిష్యత్ తరాలకు పచ్చని వారసత్వాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి Pawan Kalyan అన్నారు....