హీరోయిన్ అన్షుపై డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దాంతో డైరెక్టర్ త్రినాథరావు క్షమాపణలు చెప్పారు. ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. అందులో హీరోయిన్ అన్షుకు, తన వ్యాఖ్యల వల్ల బాధపడ్డ మహిళలందరికీ క్షమాపణలు చెప్పారు. నేను మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్ లో సరదాగా మా టీమ్ ను, హీరోయిన్ అన్షును నవ్వించేందుకు ప్రయత్నించాను. అందులో భాగంగానే అన్షుపై అనుకోకుండా అలాంటి కామెంట్స్ చేశాను. అంతే తప్ప అవి కావాలని చేసిన వ్యాఖ్యలు కావు. ఆ కామెంట్స్ వల్ల చాలా మంది మహిళల మనసు బాధపడిందని నాకు అర్థమైంది.
తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. మా హీరోయిన్ అన్షును నవ్వించేందుకు ఏదో చేద్దాం అని అలా అన్నాను. కానీ అది ఇంత పెద్ద వివాదం అవుతుందని అనుకోలేదు. కాబట్టి దయచేసి నన్ను క్షమించండి. మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పే అంటూ త్రినాథరావు చెప్పుకొచ్చారు. మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ అన్షు ఇంకా సైజులు పెంచుకోవాలంటూ ఆయన కామెంట్ చేశారు. తెలుగులో అవకాశాలు రావాలంటే ఈ సైజులు సరిపోవు అన్నట్టు అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. దాంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఓ వైపు మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. నోటీసులు పంపేందుకు రెడీ అవుతోంది. దాంతో త్రినాథరావు ఇలా వీడియోను రిలీజ్ చేస్తూ క్షమాపణలు కోరారు.
https://twitter.com/TrinadharaoNak1/status/1878737896406163740