Switch to English

ఘోరమైన ట్రాక్టర్ యాక్సిడెంట్ – 9 మంది అక్కడిక్కడే చనిపోయారు.!

కరోనా మహమ్మారి వలన ఇన్ని రోజులు లాక్ డౌన్ లో ఉన్నారు, ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని సడలింపులు వలన పట్టణాల్లో, పల్లెటూర్లలో కొన్ని కొన్ని పనులు మొదలయ్యాయి. కానీ పనులు మొదలవ్వడం ఏమోగానీ రోజుకో దారుణమైన సంఘటన జరుగుతోంది. ఇటీవలే పలు చోట్ల ఫ్యాక్టరీల్లో పలు ప్రమాదాల్లో కొందరు మరణించిన సంగతి తెలిసిందే..

కొద్ది సేపటి క్రితమే ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సడలింపుల్లో భాగంగా గత మూడు నాలుగు రోజులుగా రాపర్ల ప్రాంతంలో మిరప కోత పనులకు వెళ్తున్నారు. అలా కూలీలు వెళ్లి వస్తున్నఓ ట్రాక్టర్ కరెంట్ స్తంభాన్ని ఢీ కొనడంతో 9 మంది అక్కడిక్కడే మరణించారు. అందులో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారని సమాచారం. మరోవైపు ఈ ఘటనలో బాగా గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్ ని, ఓ మహిళని ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు.

ఈ ట్రాక్టర్ లో మొత్తంగా 15 మంది పైనే ఉండచ్చని అక్కడి స్థానికులు అంటున్నారు. కరెంట్ స్తంభానికి ఢీ కొనడంతో ఆ కరెంట్ తీగలు మనుషుల మీద పడడం వలన ఇంతమంది ప్రాణాలు పోయాయని అక్కడ ఘటనా స్థలంలోని వారు చేస్బుతున్నారు. రాపర్ల సమీపంలోని వారంతా మాములుగా ఆటోల్లో మిరపకోత పనులకి వెళ్లొస్తుంటారట, కానీ లాక్ డౌన్ కారణంగా ఆటోలు లేకపోవడంతో ఇలా ట్రాక్టర్స్ లో వెళ్లొస్తున్నారని స్థానికుల సమాచారం.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: గొర్రెకుంట మృత్యుబావి మిస్టరీలో మరో ట్విస్ట్.!

ఈ రోజు ఉదయమే వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో బయటపడిన 9 మృతదేహాల మర్డర్ కి కారణమైన సంజయ్ కుమార్ యాదవ్ నిజానిజాలు ఒప్పుకోవడంతో ఈ మృత్యుబావి మిస్టరీ...

ఆర్ఆర్ఆర్ కు చిక్కుల మీద చిక్కులు

రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా షూటింగ్ ఏడాదిన్నర నుండి సాగుతోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసారు. లాక్  డౌన్ లేకపోయి...

ఫ్లాష్ న్యూస్‌: ఏపీలో ప్రతి ముస్లీం ఇంటికి రంజాన్‌ తోఫా

కరోనా వైరస్‌ కారణంగా ఒక పండుగ లేదు ఒక పబ్బం లేదు. ప్రతి ఒక్కరు గత రెండు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నారు. ఎట్టకేలకు లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ముస్లీంలు మరో...

‘మత్తు’ డాక్టర్‌ ఎపిసోడ్‌లో ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్‌ సర్కార్‌.!

‘మత్తు’ డాక్టర్‌ సుధాకర్‌ ఉదంతంలో అధికార పార్టీకి తిప్పలు తప్పేలా కన్పించడంలేదు. ప్రభుత్వం ఇప్పటికే ఈ వ్యవహారంలో పూర్తిగా ఇరకాటంలో పడిపోయింది. ‘దళిత కార్డు’ ఓ వైపు, పోలీసుల అత్యుత్సాహం బట్టబయలవడం ఇంకో...

టిక్ టాక్ అతి : అరెస్టైన నర్స్

టిక్ టాక్ లో పాపులర్ అవ్వడం కోసం కొందరు చేసే పనులు తలుచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. ఏదేమైనా, ఏం చేసినా పాపులర్ కావాలని వాళ్ళు పడే తాపత్రయం వాళ్ళను ఇబ్బందుల్లోకి నెడుతోంది. అయినా...