Switch to English

ఏపీలో 1650కి చేరుకున్న కరోనా కేసుల సంఖ్య

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా జరుగుతోంది. తాజాగా, 24 గంటల్లో 67 కొత్త కేసులు నమోదవడంతో, మొత్తంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1650కి చేరుకుంది. అయితే, 524 మంది కరోనా నుంచి కోలుకోవడం గమనార్హం. ఇప్పటిదాకా రాష్ట్రంలో 33 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

కొత్త కేసుల విషయానికొస్తే, కర్నూలులో 25 కేసులు నమోదయ్యాయి 24 గంటల్లో. దీంతో కర్నూలులో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 491కి చేరుకోవడం గమనార్హం. కర్నూలు తర్వాతి స్థానంలో వున్న గుంటూరులో కొత్తగా 19 కేసులు నమోదు కాగా, ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 338. కృష్ణా జిల్లాలో 24 గంటల్లో కొత్తగా 12 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 278గా వుంది.

విశాఖపట్నంలో కరోనా తగ్గుముఖం పట్టినట్లే కొద్ది రోజులు కన్పించినా, తిరిగి అక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పుంజుకుంటోంది. తాజాగా నమోదైన 6 కేసులతో మొత్తంగా విశాఖలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35కి చేరింది. విజయనగరం జిల్లాలో ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

చిత్తూరు జిల్లాలో కొత్తగా ఓ కేసు నమోదయ్యింది. కడపలో 4 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, 24 గంటల్లో మొత్తం 10,292 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా వుంటే, రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1093గా వుంది.

ఇతర రాష్ట్రాలతో పోల్చితే అత్యధికంగా కరోనా పరీక్షలు రాష్ట్రంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రపదేశ్ ప్రభుత్వం చెబుతున్న విషయం విదితమే. టెస్టులు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందని సమర్థించుకోవడానికి వీల్లేని పరిస్థితి. 50 రోజుల లాక్ డౌన్ తర్వాత కూడా కేసుల నమోదు ఆగడంలేదంటే.. సడలింపుల తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపు తప్పే అవకాశాలుంటాయి.

ఇదిలా వుంటే, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా వుందని అధికార యంత్రాంగం చెబుతోంది. మరోపక్క, కొత్త కేసుల నమోదు పెరుగుతుండడంతో ఆయా జిల్లాల్లో ప్రజానీకం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సినిమా

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

మహేష్, పూరి మధ్య అంతా సమసిపోయిందా?

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఎవరైనా హిట్ అందిస్తే మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా...

రాజకీయం

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు.. ఏపీలో ఏవీ ఎక్కడ.?

జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. విభజన చట్టం ప్రకారం, అదే రోజు రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకటి పాత పేరుతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌...

జూనియర్‌ ఎన్టీఆర్‌ని బాలయ్య రమ్మన్నాడా.? వద్దన్నాడా.?

సినీ పరిశ్రమలో తాజాగా చోటు చేసుకున్న పలు వివాదాలకు కేంద్ర బిందువు నందమూరి బాలకృష్ణ. తనను సినీ పెద్దల సమావేశానికి ఆహ్వానించకపోవడంపై బాలయ్య గుర్రుగా వున్నారు. ఓ ‘బూతు’ తిట్టు కూడా తిట్టేశాడాయన...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: బాలికపై ఇద్దరు యువకుల దారుణం .. ఏడాదిగా అత్యాచారం

దేశంలో మహిళలకు రక్షణ కరువైపోతోంది. అభం శుభం తెలీని బాలికల జీవితాలు ఎందరో కామాంధుల అకృత్యాలకు బలైపోతున్నారు. ఎన్నో ఉదంతాల్లో ఎందరో నిందితులకు శిక్షలు పడుతున్నా ఇటువంటి ఆగడాలు ఆగడం లేదు. సమాజం...

మహేష్‌ ‘సర్కార్‌ వారి పాట’ పాడనున్నాడా?

గీత గోవిందం చిత్రంతో దర్శకుడిగా సూపర్‌ హిట్‌ అందుకున్న దర్శకుడు పరశురామ్‌ ప్రస్తుతం మహేష్‌బాబుతో సినిమాకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న వీరిద్దరి కాంబో మూవీ లాక్‌...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన తాతయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కామినేని...

షాకింగ్: మిడతల బిర్యానీ వారికి ఫేవరేట్ డిష్, ఎక్కడో తెలుసా??

కరోనా తర్వాత ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన అంశం మిడతల దండు. సౌత్ ఆఫ్రికా నుంచి పాకిస్థాన్ మీదుగా భారత్ లోకి వచ్చాయని భావిస్తున్న మిడతలు దేశంలోని రైతులను కలవర...

ఇకపై అయినా ట్రూకాలర్ ను వదిలేయండి

గత సంవత్సరం ట్రూకాలర్ నుండి భారతీయుల డేటా చౌర్యానికి గురి అయ్యింది అంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ సమయంలో ఆ ఆరోపణలు నిరూపితం కాలేదు. దాంతో ఆ విషయం అప్పటితో ముగిసింది....