Switch to English

స్పెషల్: ‘విజిల్’ – సినిమాలో మీ చేత విజిల్స్ వేయించే 5 పాయింట్స్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా నటించిన సినిమా ‘బిగిల్’. తెలుగు హక్కులను సొంతం చేసుకున్న నిర్మాత మహేష్ కోనేరు ఈ సినిమాని ‘విజిల్’ అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ‘సర్కార్’ సినిమాకి సూపర్బ్ కలెక్షన్స్ రావడం వలన తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ముఖ్యంగా అట్లీ – విజయ్ కాంబినేషన్ లో వస్తున్న 3వ సినిమా కావడం, అలాగే విజయ్ కెరీర్లోనే అత్యధికంగా 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడం వల్ల భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ అంచనాలు అనేది పక్కన పెడితే.. అసలు ఈ సినిమా మనం తప్పకుండా చూడాలి అనేలా సరికొత్త పాయింట్స్ ఏమున్నాయి? అని ఆలోచించే వారి కోసం Telugubulletin.com స్పెషల్ – ‘విజిల్’ తప్పక చూడాలి అనిపించేలా చేసే 5 కారణాలు..

1. స్పోర్ట్స్ ఫిల్మ్

ఇండియాలో భారీ బడ్జెట్ తో రూపొందిన మొట్ట మొదటి ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ ఫిల్మ్. ఎలా స్పెషల్ అంటే.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా గతంలో మహేష్ బాబు లాంటి స్టార్ హీరో చేసిన స్పోర్ట్స్ ఫిల్మ్ ‘ఒక్కడు'(తమిళ్లో ‘గిల్లి’ పేరుతో విజయ్ చేసాడు). కానీ ఒక స్టార్ హీరో కోచ్ గా, ఒక లేడీ టీంతో, అది కూడా ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సినిమాలో ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ప్రతి ఎపిసోడ్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుందని సమాచారం.

2. విజయ్ : డ్యూయెల్ రోల్ – మూడు వేరియేషన్స్

ఇందులో హీరో విజయ్ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. ఓల్డ్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ క్యారెక్టర్ మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టించేలా ఉంటుందట. కంప్లీట్ మాస్ ఫాన్స్ కోసం రూపొందించిన ఈ పాత్ర పంచ్ డైలాగ్స్, ఫైట్స్, తన ఎపిసోడ్స్ అన్నీ ఆడియన్స్ కి కిక్ ఇస్తాయట. ఇక యంగ్ లుక్ లో విజయ్ ఒక టైంలో స్పోర్ట్స్ మాన్ గా, ఆ తర్వాత హార్డ్ హిట్టింగ్ కోచ్ గా కనిపిస్తాడు. కాస్త నెగటివ్ షేడ్స్ లో ఉండే ఈ రోల్ యూత్ ని తెగ ఆకట్టుకునేలా ఉంటుందట. విజయ్ ఫాన్స్ కి పండుగ అయితే కామన్ ఆడియన్ కి సూపర్బ్ అనేలా విజయ్ 2 పాత్రలు ఉంటాయట.

3. 180 కోట్ల బడ్జెట్

విజయ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమా ‘విజిల్’ అలియాస్ ‘బిగిల్(తమిళ్)’. ఫైనాన్స్ ఇంటరెస్ట్ లేకుండానే ఈ సినిమాకి సుమారు 180 కోట్ల బడ్జెట్ అయ్యిందని నిర్మాతలు తెలిపారు. ఎందుకంటే ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ కోసం, రియల్ గ్రౌండ్స్, లొకేషన్స్ కోసం భారీగా ఖర్చు చేశారు. వారు పెట్టిన ప్రతిరూపాయి ఆన్ స్క్రీన్ చాలా గ్రాండ్ గా ఉంటుంది. అంతే కాకుండా ఈ సినిమాని థియేటర్ + డిజిటల్ + శాటిలైట్ కలిపి సుమారు 210 కోట్లకి అమ్ముడుపోయాయి.

4. మహిళల మీద స్ట్రాంగ్ సోషల్ మెసేజ్

‘విజిల్’ సినిమాలో మహిళల గురించి ఆప్ స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వనున్నారు. మహిళలు ప్రతి విషయంలో ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, సొసైటీలోని బాడ్ ని ఎలా పేస్ చేయాలి, ఎలాంటి సందర్భంలో అయినా స్ట్రాంగ్ గా ఎలా నిలబడి పోరాడాలి అనే విషయాలపై స్ట్రాంగ్ మెసేజ్ ఉండనుంది. ఇది ఒక స్టార్ హీరో సినిమాఅయినప్పటికీ, తాను సినిమాలో పోరాడేది మాత్రం మహిళల కోసం అనేది విశేషం.

5. సూపర్ స్టార్డం ఉన్న టెక్నీషియన్స్

హ్యాట్రిక్ హిట్స్ అందుకొని, అందులోనూ విజయ్ తో వరుసగా రెండు హిట్స్ ఇచ్చిన అట్లీ – విజయ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కావడం. అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడం. సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు, ఎడిటర్ రూబెన్ లాంటి స్టార్ టెక్నిషియన్స్ పని చేశారు. అలాగే విజయ్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే తాను కూడా ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనుంది. అంతే కాకుండా ఈ సినిమాలో రియల్ ఫుట్ బాల్ ప్లేయర్స్ కూడా నటించారు.

ఇలా తెరపై కనిపించని కొత్త కథతో, కొత్త నేపథ్యంలో, బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాని మిస్ చేయగలమా. అదికూడా దీపావళి కానుకగా అక్టోబర్ 25న రిలీజ్ కానుంది. ఈ దీపావళి పండుకకి ఓ థౌసండ్ వాలా ధమాకాలా ‘విజిల్’ ఉంటుంది. సో సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి మీరు రెడీనా..!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

ఎక్కువ చదివినవి

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...