Switch to English

డొనేషన్స్ లిస్ట్: ప్రజలకి అండగా టాలీవుడ్ స్టార్స్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

21 వేలు – కరోనా అనే మహమ్మారి ప్రపంచం మీదపడి నేటి వరకూ బలితీసుకున్న ప్రాణాలు.. దీని కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ నడుస్తోంది.. దాని కారణంగా సామాన్య ప్రజలు కొందరు ఫుడ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుతవం వీలైనంత సాయం చేస్తున్నా ఫండ్స్ సరిపోవడం లేదు.

దేశం లేదా మన రాష్ట్రాలకి ఎప్పుడు గడ్డు కాలం వచ్చినా మనం అభిమానించే సినిమా తారలు ఒక్కటై ప్రజలకి వీలైనంత సహాయసహకారాలు అందిస్తున్నారు. అందులో భాగంగానే ఇరు తెలుగు రాష్ట్రాలు లోటు బడ్జెట్ లో ఉండడం చూసి తారలు తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అలా రాష్ట్ర – కేంద్ర ప్రభుత్వాలకి సాయం చేస్తున్న స్టార్స్ మరియు వారు ఎంత డొనేట్ చేశారు అనే క్లియర్ లిస్ట్ మీకోసం.

>> హారిక హాసినీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వారు ఇరు తెలుగు రాష్ట్రాలకి చెరొక 10 లక్షల విరాళాన్ని అనౌన్స్ చేశారు.

>> క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కరోనా నిర్మూళన కోసం ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ ప్రభుత్వాలకు 10లక్షల రూపాయలు డొనేట్ చేశారు. 

>> స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రోనా నిర్మూళన కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కేరళ సిఎం రిలీఫ్ ఫండ్ కి కలిపి 1.25 కోట్లు డొనేట్ చేశారు. అందులో ఆంధ్ర ప్రదేశ్ – తెలంగాణ ప్రభుత్వాలకి చెరొక 50 లక్షలు మరియు కేరళకి 25 లక్షలు వెళ్తుంది.

>> సూపర్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ హైదరాబాద్ అండ్ చెన్నైలోని మ్యూసిషన్స్ వెల్ ఫేర్ కి 5 లక్షలు విరాళంగా అందించారు.

>> యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొద్ది సేపటి క్రితమే పీఎం రిలీఫ్ ఫండ్ కి 3 కోట్ల రూపాయలు విరాళంగా అనౌన్స్ చేశారు. ఈ రోజు(మార్చ్ 26న) ఉదయం ప్రభాస్ ఆంధ్ర ప్రదేశ్ – తెలంగాణ ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. కరోనా పై పోరాడటానికి ప్రభాస్ 4 కోట్లు మొత్తంగా డొనేట్ చేశారు. 

>> కరోనా వైరస్ నిర్మూలన సహాయార్థం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సీఎమ్ సహాయ నిధి కి 50 లక్షల రూపాయల విరాళంగానూ, అలాగే మరో 25 లక్షలు పనిలేక ఇబ్బంది పడుతున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్కర్స్ కోసం డొనేట్ చేశారు. 

>> కరోనా వైరస్ నిర్మూలన కోసం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సీఎమ్ సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

>> సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన వంతు సాయంగా తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సహాయ నిధికి 10 లక్షలు విరాళం ఇచ్చారు.

>> అల్లరి నరేష్ సరికొత్తగా అలోచించి తన ‘నాంది’ టీం కోసం పని చేస్తూ, ప్రస్తుతం పని లేక ఇబ్బంది పడుతున్న ప్రతి టీం మెంబర్ కి 10 వేళా రూపాయలు ఇచ్చి వారికి అండగా నిలబడనున్నారు. 

>> కరోనా మహమ్మారితో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం కోటి విరాళాన్ని ప్రకటించిన మెగా స్టార్ మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి

>> సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా సహాయార్థం ఇరు తెలుగు రాష్ట్రాలకి కలిపి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. 

>> జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరు తెలుగు రాష్ట్రాలకు చెరొక 50 లక్షలు డొనేట్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధాని సంక్షేమ నిధికి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు.

>> మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ సంక్షేమ నిధికి కలిపి 70 లక్షల విరాళాన్ని అనౌన్స్ చేశారు.

>> మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇరు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి చెరో 10 లక్షలు విరాళంగా ఇచ్చారు.

>> యంగ్ హీరో నితిన్ ఇరు తెలుగు రాష్ట్రాల సంక్షేమ నిధికి చెరో 10 లక్షలు ఇచ్చారు.

>> స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఆంధ్ర ప్రదేశ్ – తెలంగాణ ప్రభుత్వాలకి చెరో 5 లక్షల విరాళాన్ని అనౌన్స్ చేశారు.

>> కమెడియన్ అలీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ సంక్షేమ నిధికి చెరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు.

>> సూపర్ సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇరు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి చెరో 5 లక్షలు విరాళంగా ఇచ్చారు.

>> దిల్ రాజు అధినేత అయినా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు ఇరు తెలుగు రాష్ట్రాలకి చెరొక 10 లక్షల విరాళాన్ని అనౌన్స్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్ చరణ్

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై విమర్శలు చేస్తూ.. ఒకరకంగా హీరో, దర్శకుడు,...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా ముందుకు తీసుకెళ్తే సమాజం శెభాష్ అంటుంది....