టాలీవుడ్ యంగ్ హీరోలు నితిన్ ఇంకా నిఖిల్‌లు తమ పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే నితిన్ అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుత విపత్తు సమయంలో తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లుగా ప్రకటించాడు. అయితే నిఖిల్ మాత్రం తాజాగా తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. అయితే కన్నడ హీరో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం అయిన జాగ్వర్ హీరో నిఖిల్ గౌడ మాత్రం తన పెళ్లిని వాయిదా వేసుకునేందుకు ససేమేర అంటున్నాడు.
కన్నడ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చూస్తుంటే నిఖిల్ గౌడ వివాహం ముందుగా నిర్ణయించినట్లుగానే ఏప్రిల్ 17వ తారీకున జరుగబోతుందట. అప్పటి వరకు లాక్ డౌన్ అమలులో ఉన్నా, కరోనా అదుపులోకి రాకున్నా కూడా పెళ్లి జరగడం ఖాయంగా చెబుతున్నారు. పెళ్లి రెండు కుటుంబాలకు చెందిన 40 నుండి 50 మంది గెస్టుల సమక్షంలో సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహించేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారట.
మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు అయిన నిఖిల్ గౌడ హీరోగా పరిచయం అయిన విషయం తెల్సిందే. అలాగే రాజకీయాల్లో కూడా అడుగు పెట్టి గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశాడు. అయితే నిన్నటి తరం హీరోయిన్ సుమలతపై ఆయన ఓడిపోయాడు.
అయినా కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ కుమారస్వామి వారసుడిగా పేరు దక్కించుకుంటున్నాడు. అలాంటి నిఖిల్ గౌడ వివాహ నిశ్చితార్థం ఆమద్య అంగరంగ వైభవంగా జరిగింది. కాని పెళ్లిని మాత్రం చాలా సింపుల్‌గా కుటుంబ సభ్యులు కరోనా కారణంగా చేయబోతున్నారు.
927351 507642I feel other internet site proprietors should take this site as an model, really clean and superb user genial style . 409916
544583 840582whoa, this is a really very good piece of info. I read about something like this before, this is impressively wonderful stuff. 609058
237451 393784Some truly marvelous function on behalf of the owner of this internet web site , dead excellent articles . 610482