సినిమా రిలీజ్ అయిన గంటలోనే ‘హెచ్‌డీ’ క్వాలిటీతో ఎలా ‘గేమ్ ఛేంజర్’ లీకైంది.? సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో, కార్లు, బైక్‌లను రిపేర్ చేసే వర్క్ షాపుల్లో.. అక్కడా, ఇక్కడా అని కాదు.. ఎక్కడంటే అక్కడ ‘గేమ్ ఛేంజర్’ సినిమాని పనిగట్టుకుని ఎలా ‘షో’ వేసేశారు.. అదీ ఉచితంగా.?
కాస్త ఆలస్యంగా కళ్ళు తెరిచిన ‘గేమ్ ఛేంజర్’ టీమ్, జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసింది. సుమారు 45 మంది దుర్మార్గులు ముఠాగా ఏర్పడి, ‘గేమ్ ఛేంజర్’ టీమ్‌ని సినిమా రిలీజ్‌కి ముందే బెదిరించడం మొదలు పెట్టిందట.
పెద్ద మొత్తంలో డిమాండ్ చేసిన ఆ దుర్మార్గుల ముఠా, నిర్మాతల నుంచి ఆ ముఠా కోరుకున్న రెస్పాన్స్ రాకపోవడంతో, ‘హెచ్‌డీ క్వాలిటీ’ సినిమాని లీక్ చేసేసింది. ఇదంతా రహస్యంగా ఏమీ జరగలేదు.
సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందర, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, అల్లు అర్జున్ అభిమానులు, జూనియర్ ఎన్టీయార్ అభిమానులు.. ‘సినిమా రిలీజ్ అయిన గంటలోపే హెచ్‌డీ క్వాలిటీలో సినిమాని లీక్ చేసేస్తాం.. అదే మా లక్ష్యం..’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించేశారు.
సో.. ఇక్కడ నేరానికి పాల్పడ్డదెవరు.? అన్నది సుస్పష్టం. అరెస్టులే తరువాయి.! అయితే, చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయమై ఎంత సీరియస్‌గా వుందన్నదే కీలకం. ఎందుకంటే, సినిమాని రిలీజ్ చేసేసి.. చేతులు దులిపేసుకున్నట్లు తయారైంది పరిస్థితి.
సినిమా రిలీజ్ రోజునే, హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్ బయటకు రావడంపై మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థని ట్యాగ్ చేస్తూ, సోషల్ మీడియా నుంచి ఆ వీడియోల్ని తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు కూడా. ఆ మాటకొస్తే నెత్తీనోరూ బాదుకున్నారనడం కరెక్ట్.
అయినాగానీ, నిర్మాత దిల్ రాజు ఈ విషయమై ఇంతవరకు మీడియా ముందుకొచ్చి ఏమీ చెప్పలేదు.
గతంలో.. అంటే, ‘అత్తారింటికి దారేది’ సినిమా విషయంలోనూ పైరసీ, వెర్రి తలలు వేసింది. అయితే, ఆ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా తేడా వుంది. ఇది సోషల్ మీడియా యుగం. అప్పటికీ ఇప్పటికీ స్మార్ట్ పోన్ల వాడకం ఎక్కువైపోయింది. దాంతో, చేతిలోనే సినిమా అందుబాటులోకి వచ్చేసింది.
పైరసీ ఓ వైపు, సినిమాపై విపరీతమైన నెగెటివిటీ ఇంకో వైపు. ఓ మీడియా సంస్థకి ఐదు లక్షలు ఆఫర్ చేసి మరీ, సినిమాపై నెగెటివిటీ ప్రచారం చేయాలని కొందరు వ్యక్తులు ప్రయత్నించారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ తరఫున కొందరు, అల్లు అర్జున్ అభిమానుల ముసుగులో ఇంకొందరు, జూనియర్ ఎన్టీయార్ అభిమానుల ముసుగులో మరికొందరు.. కొన్ని మీడియా సంస్థల్ని లక్షల మొత్తానికి కొనేసి, ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై విపరీతమైన నెగెటివిటీని సృష్టించారు.
నిజానికి, ఈ దెబ్బ కేవలం ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి మాత్రమే కాదు, మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమకే ఇది పెద్ద దెబ్బ. ఎందుకంటే, ఇది క్యాన్సర్ కంటే తీవ్రమైనది. సినిమా పరిశ్రమ మొత్తాన్నీ పీల్చి పిప్పి చేసేస్తుంది.
అన్నట్టు, సినిమాకి నెగెటివ్ రివ్యూల కోసం కూడా పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘రెండున్నర దాటకూడదు’ అని ఓ వైబ్ సైట్‌కి, ఓ రాజకీయ పార్టీ సుమారు ఐదు లక్షల రూపాయలు చెల్లించిందన్నది సినీ పాత్రికేయ వర్గాల్లో వినిపిస్తోన్న గాసిప్. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకీ, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకీ.. ఇలాగే డబ్బులిచ్చి, ఆ వెబ్‌సైట్‌లో తక్కువ రేటింగ్ వేయించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.