ఐపీఎల్, ఎన్నికలు పుణ్యమా అని మూడు నెలలు టాలీవుడ్ అష్టకష్ఠాలు పడింది. ఈ మూడు నెలల్లో పట్టుమని మూడు విజయాలు కూడా దక్కింది లేదు. మే నెల అయితే అత్యంత దారుణం. అయితే ఐపీఎల్ సీజన్ ముగిసింది. రేపు ఎన్నికల ఫలితాలతో ఆ వేడి కూడా తగ్గుతుంది.
ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ జరుగుతోంది కానీ దానికి వచ్చే ఆదరణ ఐపీఎల్ తో పోల్చుకుంటే తక్కువే. దీంతో మళ్ళీ సినిమాల హడావిడి మొదలవ్వబోతోంది. ఇందుకు జూన్ నెల కీలకం కానుంది. మొదటగా జూన్ 7న శర్వానంద్ నటించిన మనమే సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
ఆ తర్వాత కాజల్ ‘సత్యభామ’ నవదీప్ ‘లవ్ మౌళి’, పాయల్ రాజ్‌పుత్ ‘రక్షణ’ చిత్రాలు కూడా విడుదలవుతున్నాయి. ఇక జూన్ నెలాఖరున అత్యంత భారీ చిత్రం కల్కి 2898 AD విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినెమాలతోనైనా టాలీవుడ్ కుదుటపడుతుందేమో చూడాలి.