మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. కేటీఆర్ ను విమర్శించే క్రమంలో నాగార్జున, సమంత, నాగచైతన్యలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై మొదటగా నాగార్జున చాలా సీరియస్ గా ఖండించారు. ఆ తర్వాత టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే అమల కూడా స్పందించారు. ఒక మహిళా మంత్రి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం నిజంగా దిగ్భ్రాంతికరం. నా భర్త (అక్కినేని నాగార్జున) గురించి తప్పుడు కథనాలు చెబుతున్న ఇలాంటి వ్యక్తులను నమ్ముతున్నారా? ఇది నిజంగా సిగ్గుచేటు. రాహుల్ గాంధీ మీ నేతలను అదుపులో ఉంచుకోండి అంటూ ఆమె ట్వీట్ చేశారు.
అటు నాగచైతన్య కూడా స్పందించారు. నాగార్జున ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఆమె వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదమని పేర్కొన్నారు. నా భార్యతో నేను విడాకులు తీసుకున్నాను. అది మా పర్సనల్. దాన్ని మీ రాజకీయాల కోసం వాడుకోవడం అత్యంత దురదృష్ణకరం. మీడియాలో హైలెట్ కావడం కోసం మా పర్సనల్ లైఫ్ ను వాడుకోవడం సిగ్గుచేటు అంటూ తీవ్రంగా స్పందించారు నాగార్జున.
సమంత స్పందిస్తూ.. నా పర్సనల్ లైఫ్ ను దయచేసి రాజకీయాల్లోకి లాగకండి. ఒక మహిళా మంత్రిగా మీ వ్యాఖ్యలు ఇలా ఉండటం బాధాకరంగా ఉంది. నా విడాకులలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి ఇలాంటి నిరాధార ఆరోపణలు మానుకోండి అంటూ ఆమె వేడుకున్నారు.
అఖిల్ స్పందిస్తూ.. అమల ట్వీట్ ను రీ ట్వీట్ చేశాడు. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులను కచ్చితంగా ఖండించాలి. కచ్చితంగా మహిళా మంత్రి వ్యాఖ్యలు అత్యంత బాధాకరంగా ఉన్నాయి. మా ఫ్యామిలీ గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ అఖిల్ ట్వీట్ చేశాడు.
నేచురల్ స్టార్ నాని స్పందిస్తూ.. రాజకీయ నేతలు ఏం మాట్లాడినా తప్పించుకుంటామని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. మీ మాటలే సరిగ్గా లేనప్పుడు మీరు ప్రజల పట్ల సరిగ్గా ఉంటారని అనుకోవడం కరెక్ట్ కాదు. ఇలాంటి మాటలను ప్రతి ఒక్కరూ ఖండించాలి అంటూ ట్వీట్ చేశారు నాని.
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. మహిళా మంత్రి అమర్యాదకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను ఇలా మీరు వార్తల్లో నిలిచేందుకు వాడుకోవడం బాధాకరం. ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేయడం సరికాదు. రాజకీయ నాయకులు, ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలి. అంతే గానీ ఇలాంటి ఆరోపణలు చేయడం మీ స్థాయిని తగ్గిస్తుంది అంటూ చిరంజీవి స్పందించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ.. కొండా సురేఖ కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ చెప్పారు. సినిమా వాళ్ల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం అత్యంత బాధాకరం. నిరాధార మైన కించపరిచే వ్యాఖ్యలను అందరూ ఖండించాలని ఆయన తెలిపారు.
విక్టరీ వెంకటేశ్ స్పందిస్తూ.. వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు వాడుకోవడం నాకు చాలా బాధ కలిగించింది. మీ రాజకీయ లబ్ది కోసం మా కుటుంబాలను రోడ్డుకు లాగడం అత్యంత బాధాకరం. ఉన్నత స్థానల్లో ఉన్న వ్యక్తులను అందరూ గౌరవించాలి అంటూ వెంకటేశ్ సీరియస్ అయ్యారు.
జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. ఆధారేల్లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. రాజకీయ లబ్ది కోసం నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. ఈ వ్యాఖ్యలు అత్యంత బాధాకరం అని ఆయన ట్వీట్ చేశాడు.
మంచు లక్ష్మీ స్పందిస్తూ.. మీ రాజకీయాల కోసం సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను లాగడం కరెక్టు కాదు. ఒక మహిళగా మీరు ఇతర మహిళల పట్ల గౌరవంగా ఉండాలి అంటూ ఆమె ట్వీట్ చేశారు.
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. మహిళా మంత్రి మాట్లాడిన మాటలు అత్యంత అమానవీయంగా ఉన్నాయి. అలాగే భయంకరంగా ఉన్నాయి. ఉన్నత పదవిలో ఉండి.. అందరినీ గౌరవించాలి గానీ.. ఇలా అవమాన పరచకూడదు.