Switch to English

సినిమా హీరోలే కాదు.. మనసున్న మారాజులు కూడా.!

‘ప్రేక్షక దేవుళ్ళు..’ అనే మాట సినీ పరిశ్రమ నుంచి తరచూ విన్పిస్తుంటుంది. ‘పేక్షక దేవుళ్ళు’ అనే మాట అనకుండా అసలు ఏ తెలుగు సినిమాకి సంబంధించిన ఈవెంట్‌ జరగదంటే అది అతిశయోక్తి కాదేమో. అవును, సినీ కళామతల్లి బిడ్డలకి, ప్రేక్షకులే దేవుళ్ళు. ఎందుకంటే, ప్రేక్షకులు లేకపోతే అసలు సినిమాలే వుండవు. ప్రేక్షక దేవుళ్ళంటే ఎవరో కాదు, ప్రజలే.

ప్రజల దృష్టిలో సినీ తారలకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అది కేవలం సినిమాకి మాత్రమే పరిమితం కాదు.! అంతకు మించి, ఆ సినిమా తారల్ని ప్రత్యేకంగా చూస్తుంటారు ప్రజలు. మరి, ఆ ప్రజల రుణం తీర్చుకోవాల్సి వస్తే.. సినీ తారలు వెనకడుగు వేస్తారా.? ఛాన్సే లేదు. ఒకర్ని మించి ఇంకొకరు.. తమ బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ముందుకొస్తున్నారు.

‘సాయం’ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు సినీ పరిశ్రమలో. నితిన్‌, రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో పది లక్షలు ప్రకటిస్తే.. మెగా పవర్‌ స్టార్‌ రావ్‌ుచరణ్‌ మొత్తంగా 70 లక్షలు ప్రకటించాడు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 75 లక్షల సాయాన్ని అందించనున్నట్లు తెలిపాడు. మెగాస్టార్‌ చిరంజీవి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించడం గమనార్హం. పవన్‌ కళ్యాణ్‌ ఏకంగా 2 కోట్లు ప్రకటిస్తే, మహేష్‌బాబు తనవంతుగా కోటి రూపాయలు ప్రకటించాడు. ప్రభాస్‌, అందరికంటే ఎక్కువగా 4 కోట్ల విరాళాన్ని ప్రకటించడం మరో పెద్ద విశేషమిక్కడ.

విరాళాలు ప్రకటించే క్రమంలో ఈ పోటీ అభినందించదగ్గదే. ఎందుకంటే, దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. యావత్‌ ప్రపంచం కరోనా వైరస్‌ దెబ్బకి విలవిల్లాడుతున్న వేళ, మన దేశంలోనూ పరిస్థితి కొంత ఆందోళనకరంగానే తయారవుతోంటే.. ‘మీకు మేమున్నాం..’ అంటున్నారు స్టార్లు.

వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన పెంచుతూ, విరాళాలు ప్రకటిస్తూ.. ప్రజల్లో భరోసా పెంచుతున్నారు. ఇక్కడ వారు ప్రకటించే డబ్బు కంటే, వారు ఇస్తోన్న భరోసా.. చాలా పెద్ద ఉపశమనం అని చెప్పక తప్పదు. తెలుగు సినీ పరిశ్రమ గతంలోనూ చాలాసార్లు తన పెద్ద మనసును చాటుకుంది. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసిందని అనుకోవాలేమో. అవును, మన తారలు సినిమా హీరోలు మాత్రమే కాదు, మనసున్న మారాజులు కూడా.!

సినిమా

కేజీఎఫ్‌ 2 గురించి రెండు బ్యాడ్‌ న్యూస్‌

కన్నడ సూపర్‌ హిట్‌ మూవీ కేజీఎఫ్‌ కు ప్రస్తుతం సీక్వెల్‌గా కేజీఎఫ్‌ 2ను చిత్రీకరిస్తున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న...

ఆచార్యలో చరణ్‌.. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన చిరు

చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో ఒక కీలక పాత్ర ఉంటుందని ఆ పాత్రను మహేష్‌ బాబు లేదా రామ్‌ చరణ్‌ చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా ఏదో...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీంకు 5 కోట్ల ఫైన్‌ వేసిన ఆలియా?

 టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్లాన్‌ వేస్తే దాన్ని అచ్చు గుద్దినట్లుగా పొల్లు పోకుంటా మొదటి నుండి చివరి వరకు ఎగ్జిక్యూట్‌ చేస్తాడనే విషయం అందరికి తెల్సిందే....

ఫ్యాన్స్‌లో గందరగోళం క్రియేట్‌ చేస్తున్న చరణ్‌

మెగా హీరో రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో చిరంజీవి ఆచార్య చిత్రంలోనూ ఒక కీలకమైన గెస్ట్‌ పాత్రలో...

‘ఒరేయ్‌ బుజ్జిగా’ ఓటీటీ ప్రచారంపై నిర్మాత స్పందన

రాజ్‌ తరుణ్‌ హీరోగా మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యి...

రాజకీయం

జనసేనాని హుందాతనం.. వైఎస్సార్సీపీ వెకిలితనం.!

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమల్లో వుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది నిస్సిగ్గుగా....

కరోనాని చంపే జెల్ ని కనుగొన్న బాంబే ఐఐటి.!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొంతమంది వాక్సిన్లు తయారీలో నిమగ్నమై ఉండగా.. మరికొంత మంది దీనిని నిరోధించే ఔషధం కనుగొనే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. వాక్సిన్...

కరోనా ఎఫెక్ట్‌: ప్రపంచం చాలా చాలా మారిపోవాల్సిందే.!

‘ఇకపై ఏదీ ఇంతకు ముందులా వుండదు..’ ఇదీ నిపుణులు చెబుతున్న మాట కరోనా వైరస్‌ గురించి. ప్రపంచం చాలా మారాలి. చాలా చాలా మార్పులు చోటు చేసుకోవాలి. అయితే, అవన్నీ మనుషుల అలవాట్ల...

శానిటైజర్‌ డబ్బా మీదకెక్కిన పబ్లిసిటీ పైత్యం.!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ పైత్యం రోజు రోజుకీ పెరిగిపోతోంది. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అన్నట్లు.. స్మశానాలకీ, మరుగుదొడ్లకీ అధికార పార్టీ రంగులు పూసిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఇప్పుడు కరోనా వైరస్‌ని...

సోనియా ఐడియా.. మీడియాకు సంకటమే

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి, కరోనాపై పోరుకు అవసరమైన నిధులు ఎలా తీసుకురావాలి అనే అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన సూచనలు మీడియాకు సంకటంగా మారాయి....

ఎక్కువ చదివినవి

కరోనా లాక్‌డౌన్‌.. ఏప్రిల్‌ కూడా అంతే.!

ఏప్రిల్‌ 14 తర్వాత దేశంలో లాక్‌ డౌన్‌ నుంచి ఉపశమనం లభిస్తుందని చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే, పరిస్థితులు అంత అనుకూలంగా కన్పించడంలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ని ఎత్తివేస్తే.. పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుందని...

‘ఒరేయ్‌ బుజ్జిగా’ ఓటీటీ ప్రచారంపై నిర్మాత స్పందన

రాజ్‌ తరుణ్‌ హీరోగా మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అయ్యింది. విడుదలకు సంబంధించిన...

చిన్న సినిమాలు అక్కర్లేదు, పెద్ద సినిమాల రేట్లు మావల్ల కాదంటున్న బయ్యర్లు

కరోనా మహమ్మారి కారణంగా సినిమా పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయి. ఇప్పటికే పలు విభాగాలకు చెందిన సినీ కార్మికులు ఉపాది లేక అవస్థలు పడుతున్నారు. ఇక త్వరలోనే లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత...

శానిటైజర్‌ డబ్బా మీదకెక్కిన పబ్లిసిటీ పైత్యం.!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ పైత్యం రోజు రోజుకీ పెరిగిపోతోంది. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అన్నట్లు.. స్మశానాలకీ, మరుగుదొడ్లకీ అధికార పార్టీ రంగులు పూసిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఇప్పుడు కరోనా వైరస్‌ని...

జగన్‌ సారూ.. కరోనా ప్రాణం తీసింది చూడూ.!

‘పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకుంటే కరోనా వైరస్‌ నయమైపోతుంది.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే వైరస్‌ తగ్గిపోతుంది..’ అంటూ మొదట్లో కరోనా వైరస్‌ని చాలా తేలిగ్గా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. కరోనా...