Switch to English

టాలీవుడ్ ‘గాడ్ ఫాదర్’ చిరంజీవి.! ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి.?

మెగాస్టార్ చిరంజీవి, తెలుగు సినీ పరిశ్రమకి పెద్దన్న.! ఔను, ఆయనే ఇప్పుడు తెలుగు సినిమాకి గాడ్ ఫాదర్.! ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం. అబ్బే, ‘ఆచార్య’ సినిమాతో ఫ్లాప్ కొట్టారు గనుక, చిరంజీవి ఇకపై ‘బాస్’ కాదు.. ఆయన కూడా డిజాస్టర్ సినిమాలకు అతీతం కాదు.. అంటూ చెత్త విశ్లేషణలు కొన్ని బులుగు, పచ్చ మీడియా సంస్థలు చేస్తున్నాయి.

ఒక్క సినిమా డిజాస్టర్‌తో కరిగిపోయే ఇమేజ్ కాదు మెగాస్టార్ చిరంజీవిది. ఆయన కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, అందరివాడు.! ఔను, చిరంజీవి అంటే ఓ శిఖరం. ఆ శిఖరాన్ని చూసి, గ్రామ సింహాలు మొగరడం అనేది సర్వసాధారణమైన విషయం.

మొన్నామధ్య మెగాస్టార్ చిరంజీవి, తెలుగు సినీ పరిశ్రమ పెద్దన్న హోదాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిస్తే, ‘అది వ్యక్తిగత సమావేశం..’ అటూ సెటైరేశాడో పిల్ల కుంక.! కానీ, పరిశ్రమ పెద్దన్నగానే చిరంజీవిని చూస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రులే కొందరు ప్రకటించారు.

సరే, ‘పెద్దన్న’, ‘పెద్దరికం’ వంటి ట్యాగ్స్ చిరంజీవి ఏనాడూ కోరుకున్నవి కావు. ‘నాకు పెద్దరికం వద్దు.. నేను పరిశ్రమ బిడ్డగా, పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా వుంటాను..’ అంటుంటారు చిరంజీవి.

ఇదిలా వుంటే, తాజాగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం భీమవరంలో జరిగింది. ప్రధాన మంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి, సినీ పరిశ్రమ తరఫున కేవలం చిరంజీవికి మాత్రమే ప్రత్యేక ఆహ్వానం అందింది. ఆ తర్వాత మరో సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కి కూడా ఆహ్వానం అందినా, అది రాజకీయ కోణంలోనే అనుకోవాలి.

ఇంతకన్నా, పరిశ్రమ పెద్ద అనే హోదా.. చిరంజీవికి ఇంకే రూపంలో వస్తుంది.? కానీ, దీన్ని ఒప్పుకునేందుకు చాలామందికి మనసొప్పడంలేదు. ఈ క్రమంలోనే ‘ఆచార్య’ సినిమా ఫెయిల్యూర్‌ని తెరపైకి తెస్తూ, కొత్తగా చెత్త విశ్లేషణలు చేస్తున్నారు. సినిమాల్లో చిరంజీవి నెంబర్ వన్.. వన్ టూ టెన్ ఆయనే. ఆ తర్వాతే ఇంకెవరైనా. ఈ మాట అన్నది ఎవరో కాదు, సూపర్ స్టార్ మహేష్‌బాబు.

పాన్ ఇండియా హీరో ప్రభాస్ సైతం, చిరంజీవి పెద్దరికాన్ని ప్రశ్నించలేదు. ప్రశ్నించడు కూడా. చిరంజీవి స్థాయి ఏంటన్నది, ఆ స్థాయి గురించి తెలిసినవారందరికీ అర్థమవుతుంది. కోవిడ్ కష్ట కాలంలో, పరిశ్రమలో కార్మికుల్ని ఆదుకునేందుకు చిరంజీవి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. హెల్త్ కార్డులు, నిత్యావసర వస్తువులు.. ఇలా ఒకటేమిటి.? పరిశ్రమ ద్వారా ఎదిగిన చిరంజీవి, ఆ పరిశ్రమకు తనవంతు సేవ చేస్తూనే వున్నారు.

చాలాకాలంగా నడుస్తున్న బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా మాత్రమే కాదు, ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేసి.. ఎన్నో ప్రాణాల్ని కోవిడ్ సమయంలో చిరంజీవి కాపాడారు. చిరంజీవి అంటే ఎవరెస్ట్ శిఖరం. ఆయన నెంబర్ వన్ పొజిషన్‌ని ప్రశ్నించేంత సీన్ ఎవరికైనా వుందా.? ఛాన్సే లేదు.

ఇక, ‘ది బాస్ ఈజ్ హియర్ టు రూల్ ఫర్ ఎవర్..’ అంటూ ‘గాడ్ ఫాదర్’ సినిమా నుంచి ప్రోమో రాగానే, పచ్చ గుండెల్లో రైళ్ళు పరిగెత్తినట్టున్నాయ్.! చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేస్తారా.? వచ్చేస్తే రాజకీయాల్లో తాము ఏమైపోతాం.? ‘గాడ్ ఫాదర్’ సినిమా హిట్టయిపోతే, సినీ పరిశ్రమలో తమ భవిష్యత్తేంటి.? అని తెగ బెంగపడిపోతున్నట్టున్నాయి.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

దిల్ రాజుకు మెగా షాక్..! ఒక్కరోజులో ఏకంగా 36వేల ట్వీట్స్ చేసిన...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు ఒక్కసారిగా ట్విట్టర్ లో ట్రెండింగ్ అయింది. ఆయన పేరు సోషల్ మీడియాలో హెరెత్తిపోయేలా చేశారు. ఇదంతా మెగా...

రాజకీయం

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ.?

మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే...

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు సరైనవి కావు..

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరు సభలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు...

ఎక్కువ చదివినవి

నాగ శౌర్య కృష్ణ వ్రింద విహారి విడుదల తేదీ ఖరారు

ప్రస్తుతం నాగ శౌర్య వరస ప్లాపులతో సతమతమవుతున్నాడు. తను నటించిన వరుడు కావలెను, లక్ష్య కూడా ప్లాపులుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. నాగ శౌర్య నుండి వస్తోన్న...

ప్రతి ఒక్కరికి నచ్చే మాస్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ : నితిన్‌

నితిన్ హీరోగా రూపొందిన 'మాచర్ల నియోజకవర్గం' విడుదలకు సిద్ధం అయ్యింది. ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి...

రాశి ఫలాలు: సోమవారం 08 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ శుద్ధ ఏకాదశి సా.5:22 వరకు తదుపరి ద్వాదశి సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం) నక్షత్రము: జ్యేష్ఠ ఉ.11:57 వరకు తదుపరి...

ఓటిటిల్లో స్ట్రీమ్ అవుతోన్న వారియర్, థాంక్యూ

రామ్ పోతినేని నటించిన ద్విభాషా చిత్రం ది వారియర్, అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ సినిమా థాంక్యూ ఇప్పుడు డిజిటల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాయి. ది వారియర్ జులై 14న విడుదలైంది. తెలుగు,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. మరి ఈరోజే విడుదలైన ఈ...