టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దీపావళి విన్నర్ ఎవరు అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఏ పండగ సమయంలో లేనంతగా ఈ సారి మూడు సినిమాల విషయంలో పెద్ద చర్చ జరిగింది. దానికి కారణం కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్లు అనే చెప్పుకోవాలి. ఈ దీపావళికి తెలుగు హీరో కిరణ్ అబ్బవరం నుంచి క సినిమా, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నుంచి లక్కీ భాస్కర్, తమిళ హీరో శివ కార్తికేయన్ నుంచి అమరన్ సినిమాలు వచ్చాయి. మూడు డిఫరెంట్ స్టోరీలతో వచ్చి పెద్ద హిట్ అయ్యాయి. ఇలా మూడు సినిమాలు ఒకేసారి హిట్ టాక్ తెచ్చుకోవడం అరుదుగానే జరుగుతాయి.
దాంతో దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎవరు విన్నర్ అయ్యారనే చర్చ మొదలైంది. వాస్తవానికి శివకార్తికేయన్, దుల్కర్ సల్మాన్ కు ఉన్నంత మార్కెట్ కిరణ్ అబ్బవరంకు లేదు. కానీ ఆయన చేసిన కామెంట్లు తెలుగు ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆలోచన తెచ్చాయి. నా సినిమాకు కన్నడ, మలయాళ, తమిళంలో థియేటర్లు దొరకట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు వేరే భాషల హీరోల సినిమాలు వస్తుంటే.. నా సినిమాను రిలీజ్ చేయొద్దని చెప్పినా రిలీజ్ చేస్తున్నాను అంటూ ఎమోషనల్ అయ్యాడు.
ఇదే సమయంలో తానేం తప్పు చేశానని ట్రోలింగ్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదంతా జనాల చూపు ఆయన మీద పడేలా చేసింది. తెలుగు ఆడియెన్స్ లో మన తెలుగు వాడి సినిమా చూద్దాం అనే ఆలోచన పెరిగింది. దాంతో ఏపీ, తెలంగాణలో అందరూ కిరణ్ అబ్బవరం సినిమాకు లైన్ కట్టేశారు. పైగా మూవీ కూడా చాలా బాగుంది. అందుకే మూవీని అనుకున్న దాని కంటే చాలా పెద్ద హిట్ చేశారు ఆడియెన్స్. కిరణ్ అబ్బవరం అలాంటి కామెంట్స్ చేయకుంటే.. ప్రమోషన్లు ఇంత బాగా చేయకుంటే మూవీ బాగున్నా ఇన్ని కలెక్షన్లు వచ్చేవి కావు.
కానీ అతను కష్టపడి ప్రమోషన్లు చేశాడు. థియేటర్లు, మెట్రో స్టేషన్లలో తిరిగాడు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయి మూవీ జనాల్లోకి బాగా వెళ్లింది. అందుకే నాలుగు రోజుల్లో ఏకంగా తెలుగులోనే రూ.26.52కోట్లు వసూలు చేసింది మూవీ. ఇప్పట్లో పెద్ద మూవీ కూడా లేదు కాబట్టి లాంగ్ రన్ లో కలెక్షన్లు మరింత పెరుగుతాయి. లక్కీ భాస్కర్, అమరన్ సినిమాలతో పోల్చితే కిరణ్ అబ్బవరం మూవీ బడ్జెట్ చాలా తక్కువ. కానీ కలెక్షన్ల పరంగా ఆ రెండు సినిమాలను మించి లాభాలు వచ్చాయి. కాబట్టి కిరణ్ కష్టమే అతన్ని దీపావళి విన్నర్ ను చేసింది.