‘పోలీసు వ్యవస్థకు కులం లేదు. పోలీసు వ్యవస్థకు రాజకీయాలు ఆపాదించొద్దు..’ అంటూ ఆంధ్రపదేశ్ పోలీస్ ఉన్నతాధికారులు పలు సందర్భాల్లో మీడియా ముందుకొచ్చి విజ్నప్తి చేస్తున్నారు. ఔను, పోలీసు వ్యవస్థకు కులం లేదు, మతం లేదు.. పోలీసులు, ప్రజలందరి కోసం పనిచేస్తున్నారు. కానీ, అన్ని వ్యవస్థల్లోనూ లోపాలున్నట్లే.. పోలీసు వ్యవస్థలోనూ లోపాలున్నాయి.
కొందరు వ్యక్తుల కారణంగా పోలీసు వ్యవస్థ మొత్తానికీ చెడ్డ పేరు వస్తోంది. కులం పేరుతో కొందరు, మతం పేరుతో కొందరు.. ‘ఫేవరిజం’ చేయడం అనేది అన్ని రంగాల్లో వున్నట్లే, పోలీసు వ్యవస్థలోనూ వుండి వుండొచ్చేమో. ‘లేదు’ అని చెబితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అలాగని, మొత్తం పోలీసు వ్యవస్థకి దాన్ని ఆపాదించడమూ సరికాదు.
అసలు విషయానికొస్తే, టీడీపీ కి చెందిన స్టూడెంట్స్ విభాగం, ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ ఇంటి యెదుట ఆందోళనకు ప్రయత్నించింది ఇటీవల. పోలీసులు, వారిని నిలువరించగలిగారుగానీ, కొందరు కాస్త ముందుకు దూసుకెళ్ళారు. వారిపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే, వారిని జడ్జిముందు హాజరు పరిచే క్రమంలో వారిపై ‘అత్యాచార యత్నం’ అభియోగాల్ని పోలీసులు మోపారు. దాంతో, జడ్జి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ‘చిన్న టైపింగ్ మిస్టేక్’ అని సరిపెట్టుకోవడానికి వీల్లేని వ్యవహారమిది. వ్యవస్థలో జరిగే చిన్న చిన్న పొరపాట్లు.. వ్యక్తుల జీవితాల్ని నాశనం చేసేస్తాయి. జడ్జి కూడా చూసుకుని వుండకపోతే ఏంటి పరిస్థితి.? అదంతా తర్వాత, అసలు పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తోంది.? ఎవరి ప్రోద్భలం మేరకు పనిచేస్తోంది.? ఏ నాయకుడి ఇంట్లో ఇలాంటి రిపోర్టులు తయారవుతున్నాయి.?
పోలీసులు, రాజకీయ నాయకులు ఇచ్చిన స్క్రిప్టులని జడ్జిల ముందు రిపోర్టులుగా పెట్టడమేంటి.? అనే ప్రశ్నలు ఖచ్చితంగా విపక్షాల నుంచి దూసుకొస్తాయి. సోషల్ మీడియాలో అయితే, ఏపీ పోలీస్ మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. పంచాయితీ ఎన్నికల నిమిత్తం.. ఆదేశాలు ఇస్తే, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడంలేదు.
అధికార పార్టీకి చెందిన వ్యక్తుల మీద సోషల్ మీడియాలో కామెంట్లు పడితే.. రాత్రికి రాత్రి అరెస్టులు జరిగిపోతున్నాయి. విపక్షాలకు చెందిన కార్యకర్తలు, అధికార పార్టీ నేతల తీరు కారణంగా ప్రాణాలు కోల్పోతోంటే, కనీసం పోలీసులు పట్టించుకోవడంలేదు. ఇవన్నీ చూస్తోంటే, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తోందో అర్థమవుతోందంటూ వివిధ రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మరి, పోలీసు పెద్దలు ఈ వ్యవహారాలపై ఏం సమాధానం చెబుతారు.?
896384 108251Quite nice post. I just stumbled upon your blog and wanted to say that Ive truly enjoyed surfing around your blog posts. After all I will probably be subscribing to your feed and I hope you write once again quite soon! 843925
428901 752039My California Weight Loss diet invariably is an cost effective and versatile staying on your diet tv show made for people who locate themselves preparing to drop extra pounds and furthermore ultimately keep a much healthier habits. la weight loss 338035
143382 749857wonderful issues altogether, you just gained a new reader. What could you recommend about your post that you produced some days within the past? Any positive? 870513