Switch to English

రెండవ తుపాకి కథ రెడీ అయ్యిందట

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా దాదాపు ఎనిమిది ఏళ్ల క్రితం వచ్చిన తుపాకి చిత్రంకు సీక్వెల్‌ రాబోతుంది అంటూ గత కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. తుపాకి సినిమాకు మురుగదాస్‌ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు సీక్వెల్‌కు కూడా ఆయనే దర్శకత్వం వహించబోతున్నాడు. విజయ్‌తో తెరకెక్కించిన చిత్రాలు వరుసగా విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో దర్శకుడు మురుగదాస్‌ మరో సక్సెస్‌ కోసం మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం స్క్రిప్ట్‌ను రెడీ చేశాడట.

మొదట వీరిద్దరి కాంబోలో రాబోతున్న కొత్త సినిమా ఫ్రెష్‌ స్క్రిప్ట్‌ అంటూ వార్తలు వచ్చాయి. కాని తుపాకి సీక్వెల్‌గా మురుగదాస్‌ చెప్పిన స్టోరీ లైన్‌ విజయ్‌కు అమితంగా నచ్చడంతో దాన్నే చేయాలని నిర్ణయించుకున్నాడట. సామాజిక సమస్యలను టచ్‌ చేస్తూ సాగే ఆ స్క్రిప్ట్‌ విజయ్‌ కు నచ్చడంతో మురుగదాస్‌ ఆ స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్లుగా తమిళ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

తాజాగా తుపాకి సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ సీక్వెల్‌పై హింట్‌ ఇచ్చాడు. ఇటీవల ఈయన తుపాకి సినిమా పాత స్టిల్స్‌ను ట్వీట్‌ చేశాడు. దాంతో ఖచ్చితంగా విజయ్‌, మురుగదాస్‌, సంతోష్‌ శివన్‌ల కాంబోలో మరో తుపాకి రాబోతుంది అనే నమ్మకంను ఫ్యాన్స్‌ వ్యకం చేస్తున్నారు. విజయ్‌ నటించిన మాస్టర్‌ చిత్రం గత నెలలో విడుదల కావాల్సి ఉంది. కాని కరోనా కారణంగా వాయిదా పడినది. లాక్‌ డౌన్‌ లేకుండా ఉంటే ఇప్పటి వరకు మురుగదాస్‌, విజయ్‌ల కాంబో మూవీ పట్టాలెక్కేదంటూ తమిళ మీడియా అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్‌ విజయం కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

జస్ట్‌ ఆస్కింగ్‌: టీటీడీ శ్వేతపత్రంలో ‘పింక్‌’ డైమండ్‌ వుంటుందా.?

పింక్‌ డైమండ్‌.. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామికి సంబంధించి భక్తులు సమర్పించుకున్న అతి విలువైన వాటిల్లో ఇదీ ఒకటంటూ గత కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతోంది. ప్రచారం మాత్రమే కాదు, దీని చుట్టూ జరిగిన...

మహిళలా మజాకానా.. బాత్రూంలో దాక్కున్న ఎంపీడీఓ.!

మాములుగా ఇంట్లో భార్యకి కోపమొస్తేనే తట్టుకోలేం అని పలు సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం. అలాంటిది తమ గోడు వినిపించుకోని అధికారిపై 100 మంది మహిళలు ఒకేసారి వస్తే ఎంతటి వారైనా పారిపోవాల్సిందే. అలాంటి...

అమెరికాలో ఆగని నిరసనలు.. పోలీస్ స్టేషన్ కు నిప్పు

అమెరికాలో జాతి విద్వేషాలు రగులుకున్నాయి. మూడు రోజులుగా అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా కొందరు నిరసనకారులు మినిపోలిస్ స్టేషన్ ను ముట్టడించి నిప్పు పెట్టారు. మూడు...

ఫొటోటాక్‌ : రకుల్‌ ఈసారి మొత్తం బటన్స్‌ విప్పేసింది

హాట్‌ మద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఈమద్య కాలంలో ఆఫర్లు లేకుండా పోయాయి. తెలుగు మరియు తమిళంలో ఈ అమ్మడు రెండు మూడు సంవత్సరాలు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీ గడిపిన...

శానిటైజ్ చేసేప్పుడు ఇంజిన్ ఆన్ లో ఉంటే ఇలానే పేలిపోద్ది.!

జాగ్రత్త సుమీ: వెహికల్ శానిటైజేషన్ అనేది తప్పనిసరి అయిన ఈ కరోనా టైంలో బైక్ ఇంజిన్ ఆన్ లో ఉండగా శానిటైజ్ చేయించవద్దు. అలా చేస్తే ఇలానే మంటలు చెలరేగి ప్రాణాలు పోగొట్టుకునే...