నాయకుడు కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద హిట్ అవుద్ది.. కమల్ హాసన్ ధీమా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,094FansLike
57,764FollowersFollow

నాయకుడు సినిమా కంటే థగ్ లైఫ్ పెద్ద హిట్ అవుతుందని విశ్వ నటుడు కమల్ హాసన్ అన్నారు. కమల్, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీ జూన్ 5న రాబోతోంది. ఈ మూవీని దర్శకుడు మణిరత్నం తెరకెక్కించారు. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో కమల్ మాట్లాడుతూ.. ‘మణిరత్నం గారు నాకు చాలా స్పెషల్. ఆయన గతంలో నాయకుడు సినిమాతో భారీ హిట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మూవీతో అంతకంటే సర్ ప్రైజ్ హిట్ ఇవ్వబోతున్నారు. చాలా మంది నన్ను గురువు స్థానంలో చూస్తున్నారు. కానీ నేను ద్రోణాచార్యుడిని కాదు.. ఇంకా స్టూడెంట్ గానే ఉన్నాను. అన్నీ నేర్చుకుంటూనే ఉన్నాను. ఈ మూవీని అందరం కష్టపడి చేశాం. మణిరత్నం గారితో సినిమా అంటే.. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం. శింబు సినిమాలు ఎప్పుడూ చూస్తాను. ఈ మూవీతో అతనితో బాగా కనెక్ట్ అయ్యాను. అతను చాలా బాగా నటించాడు. ఈ మూవీ పెద్ద హిట్ అవుతుంది. అందరూ ఎంజాయ్ చేయండి’ అంటూ తెలిపారు.

డైరెక్టర్ మణిరత్నం మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ తో చేసిన నాయకుడు సినిమా వెనక ఓ పెద్ద కథ ఉంటుంది. అనుకోకుండా చేసిన ఆ మూవీ మంచి హిట్ అయింది. కానీ ఇప్పుడు చేసిన థగ్ లైఫ్ అనుకుని అన్నీ సెట్ చేసుకున్నాకే చేశాం. ఆయనతో ఇన్నేళ్ల తర్వాత సెకండ్ సినిమా అవకాశం రావడం ఆనందంగా ఉంది. కమల్ హాసన్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. ఆయన డైరెక్టర్ కు అనుకూలంగా ఉంటారు’ అని చెప్పుకొచ్చారు.

హీరో శింబు మాట్లాడుతూ ‘తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్నారు. త్వరలోనే ఓజీలో ఓ సాంగ్ రాబోతోంది. దాన్ని నేనే పాడాను. అది నాకు ఒక కల. మణిరత్నం గారితో సినిమా చేస్తే చాలా విషయాలు నేర్చుకుంటాం. క్రమశిక్షణ, హార్డ్ వర్క్ మళ్లీ అలవాటు అవుతాయి. కమల్ హాసన్ గారితో వర్క్ చేయడం నిజంగా గొప్ప అనుభూతి’ అంటూ చెప్పుకొచ్చాడు.

హీరోయిన్ త్రిష మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ గారితో జర్నీ ఎప్పుడూ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆయనతో వర్క్ చేసే అవకాశం రావడం నా అదృష్టం. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ మూవీని ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. నాకు హైదరాబాద్ సెకండ్ హోమ్. ఈ మూవీని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చింది త్రిష.

సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ.. ‘ఈ మూవీతో బెస్ట్ ట్యాలెంటెడ్ యాక్టర్లు కలిసి నటించారు. ఇది చాలా మంచి మూవీ. ఇలాంటివి మళ్లీ మళ్లీ రావు. కాబట్టి అందరూ కుటుంబాలతో వచ్చి మూవీని చూసి ఎంజాయ్ చేయండి. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకం మాకు ఉంది. ఈ మూవీని కూడా ఆదరించండి’ అంటూ చెప్పింది.

సినిమా

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా...

రాజకీయం

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

ఎక్కువ చదివినవి

రేణూ దేశాయ్‌పై అసభ్య కామెంట్లు… ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు

నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియా రీల్స్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఇద్దరిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవడం...

పులివెందులకు గుడ్ బై.? ‘మావిగన్’ నుంచి పోటీ చేయనున్న జగన్.?

రాయలసీమపై వైఎస్సార్సీపీ ఆశలు వదిలేసుకుందా.? పులివెందుల నుంచి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ పోటీ చేయడంలేదా.? వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘మావిగన్’ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారా.? ‘మావిగన్’...

Allu Arjun: అల్లు అర్జున్.. ఇప్పుడు పేరు కాదు.. అదొక ‘బ్రాండ్’

Allu Arjun: సినీ పరిశ్రమలో హీరోల వారసులు చాలామందే ఉన్నారు. హీరోల కుమారులు కాకుండా పరిశ్రమలో నిర్మాత, దర్శకుల వారసులకూ కొదవలేదు. అటువంటి హీరోల్లో ఒకరు అల్లు అర్జున్. అగ్ర నిర్మాణ సంస్థగా...

“కామెడీ పేరుతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దూషణలు… అనుదీప్‌పై ఆగ్రహ జ్వాలలు!”

స్టాండ్‌అప్ కామెడీ పేరుతో రాజకీయ నాయకులు, వారి కుటుంబాలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. కామెడియన్ అనుదీప్ తాజాగా అండర్ గ్రౌండ్స్ స్టూడియో వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్...

ధాన్యం అమ్మితే.. గంటల్లోనే డబ్బులా?

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, రైతులకు చెల్లింపుల వ్యవహారం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రైతులు ధాన్యం అమ్మిన వెంటనే లేదా చాలా తక్కువ సమయంలోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయని...