విశ్వక్ సేన్ నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్ ఇండస్ట్రీ పృధ్విరాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. సినిమాలో ఒక సీన్ గురించి చెబుతూ ఒక పార్టీని ఉద్దేశించి ఆయన కామెంట్స్ ఉన్నాయని ఆ పార్టీ కార్యకర్తలు హర్ట్ అయ్యారు. దానితో అప్పటి నుంచి బాయ్ కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.
లైలా హీరో కూడా ఈ విషయంపై క్షమాపణ చెప్పాడు. అయినా కూడా వారు ఏమాత్రం తగ్గలేదు. ఐతే సినిమా రిలీజ్ రేపనగా 30 ఇయర్స్ పృధ్వి రాజ్ తాజాగా తన అన్న వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాడు. సినిమా నటుడిగా కమెడియన్ గా కాస్త వెటకారం ఉంటుంది. అది వెన్నతో పెట్టిన విద్య. వ్యక్తిగతంగా ఎవరి మీద ధ్వేషం లేదు. రాజకీయాలు వేరే వేదిక మీద మాట్లాడుదాం. దాని వల్ల సినిమాను కిల్ చేయొద్దు.. సినిమాను ప్రేమిద్దాం.. ఎందుకంటే మనం భోజనం చేసేది సినిమాల మీదే. ఇంత క్రేజ్ వచ్చింది అంటే సినిమాల వల్లే.. నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే దృడ సంకల్పంతో తను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే సారీ.. సో ఇంతటితో దీనికి ముంగింపు పలకండి.. లైలాని బాయ్ కాట్ చేయొద్దు వెల్కం చెప్పండని అన్నారు పృధ్వి రాజ్.
లైలా సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా 14న రిలీజ్ అవుతుంది. లైలా లవ్లీ టీం అంతా రాక్ చేయబోతున్నారని.. ఫలక్ నుమా దాస్ కన్నా లైలా పెద్ద హిట్ అవుతుందని అన్నారు పృధ్విరాజ్.