జాతిరత్నాలు అనుదీప్ ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత సైలెంట్ గా కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా తీసి వదిలాడు. ఆ సినిమా కమర్షియల్ గా కొంత నిరాశపరచినా ఇప్పటికీ ఆ సినిమాలో సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక అనుదీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా ఫంకీ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈమధ్యనే సినిమా అనౌన్స్ మెంట్ రావడం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలవడం జరిగింది.
లైలా తో మరో షాక్ తగిలిన విశ్వక్ సేన్ ఫంకీ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. అనుదీప్ డైరెక్షన్ లో విశ్వక్ సేన్ చేయబోతున్న సినిమా కూడా అనుదీప్ మార్క్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా హీరోయిన్ వేటలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అనుదీప్ డైరెక్షన్ లో ఆఫర్ అంటే ఏ హీరోయిన్ అయినా కాదనే ఛాన్స్ లేదు.
ఐతే ఫంకీ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్స్ మధ్య చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి మొదటి ప్రాధాన్యత కాగా ఆమె కుదరకపోతే నా సామిరంగ ఫేమ్ ఆషిక రంగనాథ్ ని తీసుకోవాలని చూస్తున్నారట. ఇద్దరిలో ఎవరు ఫైనల్ అన్నది త్వరలో తెలుస్తుంది. అనుదీప్ కామెడీకి విశ్వక్ సేన్ మాస్ మేనియా తోడైతే ఎలా ఉంటుందో చూడాలని ఆడియన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.