సినిమా పరిశ్రమలో అన్ని విభాగాలు కూడా చాలా కీలకం. కాని కొన్ని విభాగాలకు చెందిన వారిని మాత్రం అత్యంత చులకనగా చూస్తారు. ముఖ్యంగా నిర్మాతలను ఈమద్య కాలంలో కూరలో కరివేపాకులా తీసి పారేస్తున్నారు. ఒకప్పుడు రామానాయుడు వంటి వారి ముందు పెద్ద హీరోలు కూడా చేతులు కట్టుకుని నిల్చునేవారట. కాని ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయ్యింది. చిన్న హీరోల ముందు కూడా నిర్మాతలు బాబు బాబు అంటూ తిరగాల్సిన పరిస్థితి. అంత అణిగిమణిగి ఉన్నా కూడా నిర్మాతలను హీరోలు ఏకి పారేస్తూనే ఉన్నారు.
ఎంతో మంది నిర్మాతలు సినిమాల వల్ల చాలా నష్టపోయారు. సినిమాలపై అభిమానంతో కోట్లు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దర్శకుడు, హీరోలపై నమ్మకంతో సినిమాలు తీశారు. కాని వారిలో చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు. సినిమాతో ఆర్థికంగా నష్టపోయినా, అప్పులపాలయినా కూడా హీరోలు మాత్రం నిర్మాతల నుండి పారితోషికాలను ముక్కు పిండి మరీ వసూళ్లు చేస్తారు. ఇటీవల వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం విడుదలకు విజయ్ దేవరకొండ పారితోషికంను నిర్మాత సెటిల్ చేసేందుకు ఖరీదైన ఆస్తిని అమ్మేయాల్సి వచ్చిందట.
సినిమా విడుదలకు ముందే నిర్మాతలు పూర్తిగా హీరోలకు సెటిల్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్బాల్లో వారు సెటిల్ చేయడంలో విఫలం అయితే హీరోలు సినిమాలు ఆపేసిన సందర్బాలు కూడా చాలా ఉన్నాయి. నిర్మాతలను అంతలా ఇబ్బంది పెట్టే వారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. మనం స్టార్స్‌గా చెప్పుకునే చిరంజీవి, బాలకృష్ణ, నాని, విజయ్ దేవరకొండ ఇంకా కొందరు కూడా నిర్మాతల నుండి ముక్కు పిండి డబ్బులు వసూళ్లు చేసిన వారే.
నిర్మాతలకు వచ్చే కలెక్షన్స్ ఆదాయం ఇవేవి వారికి పట్టవు. తాము ఒప్పందం చేసుకున్నదంతా వచ్చిందా లేదా అనేది వారు చూసుకుంటారు. నిర్మాతలు ఇంతగా ఇబ్బందులు పడుతున్నా కూడా కొత్త వారు సినిమాపై మోజుతో వస్తూనే ఉన్నారు.
606435 788913Hello fellow web master! I genuinely enjoy your internet site! I liked the color of your sidebar. 740351
404599 865224Vi ringrazio, considero che quello che ho letto sia ottimo 631231
585519 911380You seem to be really specialist inside the way you write.::~ 666415